కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్ర మంత్రి, ఒకప్పటి బెంగాళీ నటుడు బాబుల్ సుప్రియో సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఉన్నట్టుండి ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో హుటాహుటిన కోల్కతాలోని ఓ ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చేరిన వెంటనే వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు చేశారు. గుండె రక్తనాళాల పనితీరును తెలుసుకునేందుకు యాంజీయోగ్రామ్ కూడా చేశారు. దాంతో ఆయనకు మైనర్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.