Watch: వివాహ రిసెప్షన్లో ఘర్షణ.. కుర్చీలు విసిరి కొట్టుకున్న రెండు వర్గాలు
Brawl At Wedding Reception | వివాహ రిసెప్షన్లో ఘర్షణ జరిగింది. డీజే డ్యాన్స్ నేపథ్యంలో రెండు వర్గాల వారు కొట్టుకున్నారు. ఒకరిపై మరొకరు కుర్చీలు విసురుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లక్నో: వివాహ రిసెప్షన్లో ఘర్షణ జరిగింది. డీజే డ్యాన్స్ నేపథ్యంలో రెండు వర్గాల వారు కొట్టుకున్నారు. ఒకరిపై మరొకరు కుర్చీలు విసురుకున్నారు. (Brawl At Wedding Reception) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. అమీనాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంగే నవాబ్ పార్క్ ప్రాంతంలో ఉన్న బుద్ధ లాల్ బద్లు ప్రసాద్ ధర్మశాలలో శుక్రవారం రాత్రి పెళ్లి రిసెప్షన్ జరిగింది. ఈ సందర్భంగా డీజే మ్యూజిక్కు అనుగుణంగా కొందరు డ్యాన్స్ చేశారు.
కాగా, డ్యాన్స్ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఒకరినొకరు కొట్టుకున్నారు. అక్కడున్న కుర్చీలను విసురుకున్నారు. ఈ సంఘటనలో మహిళతో సహా ముగ్గురు గాయపడ్డారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరు వర్గాలకు సర్దిచెప్పడంతోపాటు వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో ఎలాంటి కేసు నమోదు చేయలేదు. మరోవైపు కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
शादी समारोह में शामिल युवकों ने जमकर मचाया हंगामा !!#लखनऊ !!
थाना #अमीनाबाद क्षेत्र में गूंगे नवाब पार्क के सामने बुद्ध लाल बदलू प्रसाद धर्म ट्रस्ट में शादी समारोह में शामिल हुए युवकों ने जमकर मचाया हंगामा।शादी में अफरा-तफरी माहौल।
मारपीट के दौरान जमकर चलाई कुर्सी कई लोगों… pic.twitter.com/7G3h9DNJaK
— MANOJ SHARMA LUCKNOW UP🇮🇳🇮🇳🇮🇳 (@ManojSh28986262) February 9, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Brawl
- DJ Dance
- Lucknow
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

