బ్రాండెడ్ చెప్పుల ద్వారా.. మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు
మృతురాలి కాళ్లకు బ్రాండెడ్ శాండిల్స్ ఉండటం పోలీసులు గమనించారు. ఆ దిశగా దర్యాప్తు జరిపారు.
ముంబై: మహిళ ధరించిన బ్రాండెడ్ చెప్పుల ద్వారా ఆమె హత్య కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు భార్యలు ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 14న మాథేరన్ పర్వత ప్రాంతంలోని గడి నది ఒడ్డున మహిళ మృతదేహం కనిపించింది. దీంతో పన్వెల్ పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలిని 27 ఏళ్ల ఊర్వశి వైష్ణవ్‌గా గుర్తించారు. మృతదేహం పడి ఉన్న ప్రాంతంలో సీసీటీవీ కెమేరాలు లేకపోవడంతో నిందితుడి గురించి ఎలాంటి ఆధారాలు లభించలేదు.
కాగా, మృతురాలి కాళ్లకు బ్రాండెడ్ శాండిల్స్ ఉండటం పోలీసులు గమనించారు. ఆ దిశగా దర్యాప్తు జరిపారు. ఆ బ్రాండెడ్ శాండిల్స్ అమ్మే అన్ని చెప్పుల షాపుల నుంచి సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరించి పరిశీలించారు. చివరకు వారి శ్రమ ఫలించింది. వారం రోజుల ముందు ఊర్వశి ఒక వ్యక్తితో కలిసి నవీ ముంబైలోని బ్రాండెడ్ చెప్పుల షాపులో శాండిల్స్‌ను కొనుగోలు చేసిన వీడియో ఫుటేజ్ లభించింది.
మరోవైపు ఊర్వశి పక్కన ఉన్న వ్యక్తి దృఢంగా ఉండటంతో పోలీసులు జిమ్ సెంటర్లలో ఆరా తీశారు. చివరకు ఆ మహిళ ప్రియుడైన 36 ఏళ్ల రియాజ్ ఖాన్‌ను గుర్తించారు. జిమ్ ట్రైనర్ అయిన అతడికి ముగ్గురు భార్యలు ఉన్నట్లు తెలుసుకున్నారు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తుండటంతో ప్రియురాలు ఊర్వశిని అతడు హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో నిందితుడు రియాజ్ ఖాన్‌తోపాటు మహిళ మృతదేహాన్ని పడేసేందుకు సహకరించిన 26 ఏళ్ల ఇమ్రాన్ షేక్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun | హీరో అర్జున్ ఇంట పెళ్లి సందడి.. 14 ఏళ్ల ప్రేమకు పెళ్లి బంధంతో ముగింపు!
KBR Park | ఎక్కడి స్తంభాలు అక్కడే.. పనులు ఆగిన కేబీఆర్ పార్క్ వద్ద అధ్వాన స్థితి!
Bigg Boss 10 | బిగ్‌బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్.. దక్షి, షాలినిని కావాలనే ఎలిమినేట్ చేశారా?
GHMC | లంచాలు ఇచ్చినోళ్లకే పనులు.. ఇంజినీరింగ్ విభాగంలో అవినీతి ‘అక్రమార్కులు’
Hyderabad | మరోసారి భూముల వేలం.. రూ. 2 వేల కోట్ల సేకరణే లక్ష్యంగా HMDA పావులు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

