Boy With 2 Extra Feet | బాలుడికి నాలుగు కాళ్లు.. సర్జరీ ద్వారా అదనపు కాళ్లను తొలగించిన ఎయిమ్స్ వైద్యులు
Boy With 2 Extra Feet | ఒక బాలుడికి పుట్టుక నుంచి నాలుగు కాళ్లు ఉన్నాయి. సాధారణ కాళ్లతోపాటు పొట్ట వద్ద మరో రెండు కాళ్లు ఉన్నాయి. దీంతో తోటి పిల్లల అవహేళనతో మధ్యలోనే చదువు మానేశాడు. చాలా ఏళ్లుగా మానసిక వేదన అనుభవించాడు.
న్యూఢిల్లీ: ఒక బాలుడికి పుట్టుక నుంచి నాలుగు కాళ్లు ఉన్నాయి. (Boy With 2 Extra Feet) సాధారణ కాళ్లతోపాటు పొట్ట వద్ద మరో రెండు కాళ్లు ఉన్నాయి. దీంతో తోటి పిల్లల అవహేళనతో మధ్యలోనే చదువు మానేశాడు. చాలా ఏళ్లుగా మానసిక వేదన అనుభవించాడు. ఆ యువకుడికి ఎయిమ్స్ వైద్యులు కొత్త జీవితం ప్రసాదించారు. పొట్ట వద్ద ఉన్న అదనపు కాళ్లను అరుదైన సర్జరీ ద్వారా తొలగించారు. ఉత్తరప్రదేశ్‌లోని బలియాకు చెందిన 17 ఏళ్ల బాలుడు నాలుగు కాళ్లతో పుట్టాడు. పొట్ట భాగం వద్ద అదనంగా మరో రెండు కాళ్లు వేలాడుతున్నాయి. దీంతో చిన్నప్పటి నుంచి అవహేళనకు గురైన అతడు 8వ తరగతి నుంచి స్కూల్ మానేశాడు. శారీరక ఎదుగుదల లేకపోవడంతో మానసికంగా ఎంతో కుంగిపోయాడు.
కాగా, జనవరి 28న ఢిల్లీలోని ఎయిమ్స్ అవుట్ పేషెంట్ విభాగానికి ఆ యువకుడ్ని తీసుకువచ్చారు. అతడి కడుపు వద్ద వేలాడుతున్న అదనపు కాళ్లను డాక్టర్లు పరిశీలించారు. ఆ బాలుడికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. అదనపు కాళ్లను తొలగించారు. వైద్యపరంగా ఒక ఘనత సాధించారు.
మరోవైపు ఇలాంటి సర్జరీ నిర్వహించడం ఎయిమ్స్‌లో తొలిసారి అని డాక్టర్ కృష్ణ తెలిపారు. రెండు అదనపు కాళ్ళు ఉండటం వల్ల ఆ యువకుడి శరీరం సరిగ్గా పెరగలేకపోయిందని తెలిపారు. దీనివల్ల ఇతర అవయవాలు కూడా దెబ్బతినే అవకాశం ఉందని చెప్పారు. శారీరక సమస్యలతో పాటు మానసికంగా కుంగిపోయిన ఆ యువకుడికి అరుదైన సర్జరీ ద్వారా అదనపు కాళ్లను తొలగించినట్లు వెల్లడించారు.
వైద్యపరంగా ‘అసంపూర్ణ కవలలు’గా పిలిచే ఇలాంటి కేసు కోటి మందిలో ఒకరికి ఉంటుందని డాక్టర్ కృష్ణ తెలిపారు. గర్భంలోని కవలల్లో ఒకరి శరీరం అభివృద్ధి చెందకపోవడం, ఒకరి అవయవాలు మరో బిడ్డ శరీరానికి అతుక్కోవడం వల్ల ఇలా పుడతారని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా నాలుగు కాళ్లు ఉన్న వ్యక్తుల కేసులు 42 మాత్రమే నమోదయ్యాయని ఆయన వెల్లడించారు,
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

