న్యూఢిల్లీ : హుషారైన బీట్స్‌కు చిన్నారులు కాలు కదిపితే చూడముచ్చటగా ఉంటుంది. ఓ బాలుడు ఇచ్చిన భాంగ్రా పెర్ఫామన్స్ వీడియో తాజాగా నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో బాలుడు భాంగ్రా డ్యాన్స్‌తో హోరెత్తించాడు.
బాలుడు తన డ్యాన్స్ కొనసాగించగా ఇతర చిన్నారులు కూడా అతనికి తోడై డ్యాన్స్ చేయడం అందరినీ ఆకట్టుకుంది. వీడియో చివరిలో పలువురు పిల్లలు డ్యాన్స్ ఫ్లోర్లో తమ డ్యాన్స్ పెర్ఫామెన్స్‌తో దుమ్మురేపారు. ఈ డ్యాన్స్ వీడియో పలువురి ముఖాలపై నవ్వులు పూయించింది. హుషారైన డ్యాన్స్ మూమెంట్స్ ప్రదర్శించిన చిన్నారిపై నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు.
ఈ వీడియోను ఇప్పటివరకూ 58 లక్షల మంది వీక్షించారు. బాలుడి డ్యాన్స్ చూస్తుంటే తనకూ స్టెప్స్ వేయాలనిపించిందని ఓ యూజర్ కామెంట్ చేయగా, అతడి పెర్ఫామెన్స్‌కు ఇక మాటల్లేవ్ అని మరో యూజర్ రాసుకొచ్చారు. గాడ్ బ్లెస్ యూ బాబూ అని మరో యూజర్ కామెంట్ చేశారు. ఈ క్లిప్ బాలుడి ఇన్స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేయగా అతడి బయోలో హర్‌ప్రీత్ సింగ్, ఆర్టిస్ట్ అనే వివరాలున్నాయి.