Bombay High Court | ముంబై: బాడీ మసాజర్ పరికరాన్ని సెక్స్ టాయ్‌గా పరిగణించలేమని.. వాటిని నిషేధిత దిగుమతి వస్తువుల జాబితాలో చేర్చలేమని బాంబే హైకోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. గతంలో దీనిపై కస్టమ్స్ విభాగం ఇచ్చిన ఆదేశాలను కోర్టు కొట్టివేసింది.
కస్టమ్స్ కమిషనర్ బాడీ మసాజర్‌ను సెక్స్ టాయ్‌గా ఊహించుకొని ఉంటారని.. అందుకే నిషేధిత వస్తువుల జాబితాలో ఉంచారని కోర్టు వ్యాఖ్యానించింది. మే 2023లో కేంద్ర ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆదేశాలను సవాల్ చేస్తూ కస్టమ్స్ కమిషనర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు ఈ సందర్భంగా కొట్టేసింది.