Delhi Schools: 23 స్కూళ్లకు బాంబు బెదిరింపు కేసులో.. 12వ తరగతి విద్యార్థి అరెస్టు
Delhi Schools : స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చిన కేసులో ఢిల్లీ పోలీసులు గుట్టువిప్పారు. ఆ కేసులో 12వ తరగతి విద్యార్థి విద్యార్థిని అరెస్టు చేశారు. స్కూల్ ఎగ్జామ్స్‌ను తప్పించుకునేందుకు ఆ స్టూడెంట్ బెదిరింపు మెయిల్స్ చేసినట్లు గుర్తించారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల వరుసగా స్కూళ్లకు(Delhi Schools) బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ బెదిరింపుల వెనుక ఉన్న అసలు దొంగను ఢిల్లీ పోలీసులు పట్టేశారు. ఓ మైనర్ విద్యార్థి.. తన స్కూల్ పరీక్షలను తప్పించుకునేందుకు ఆ బెదిరింపులు చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనలో 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని కస్టడీలోకి తీసుకున్నారు. స్కూళ్లకు బెదిరింపులు రావడంతో.. చాలా రోజుల ఢిల్లీలో ప్రభుత్వ అధికారులు హైరానాకు గురయ్యారు.
దాదాపు ఆరుసార్లు బాంబు బెదిరింపు మెయిల్స్ చేశాడు ఆ స్టూడెంట్. అయితే ప్రతిసారి తన స్వంత స్కూల్ కాకుండా.. మిగితా స్కూళ్ల పేరు మీద అతను బెదిరింపు మెయిల్స్ చేసేవాడు. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు అతను ఆ ప్లాన్ చేశాడు. ప్రతిసారి అతను తన మెయిల్లో.. ఒకేసారి పలు స్కూళ్లకు బెదిరింపు మెయిల్స్ చేసేవాడు. ఓ సారి ఏకంగా అతను 23 స్కూళ్లకు ఒకేసారి మెయిల్ చేశాడు.
స్కూల్లో పరీక్షకు హాజరు కావాలన్న ఉద్దేశం లేకపోవడంతో ఆ మైనర్ విద్యార్థి బాంబు బెదిరింపు మెయిల్స్ చేసినట్లు అధికారులు చెప్పారు. ఆ బెదిరింపుల వల్ల ఎగ్జామ్స్ రద్దు అవుతాయన్న ఉద్దేశంతో అతను అలా చేసినట్లు పసికట్టారు. డజన్ల సంఖ్యలో ఉత్తుత్తి బాంబు బెదిరింపులు రావడంతో.. కొన్ని వారాల పాటు ఢిల్లీ అధికారులు టెన్షన్ ఫీలయ్యారు. ఢిల్లీలో తానెప్పుడూ ఇలాంటి భయానక పరిస్థితి చూడలేదని విద్యాశాఖ మంత్రి మనీశ్ సిసోడియా తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

