పంజాబ్ సీఎం భగవంత్ మాన్ నివాసం వద్ద బాంబు కలకలం
పంజాబ్ సీఎం నివాసం, హెలిప్యాడ్‌కు సమీపంలోని మామిడి తోటలో సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ట్యూబ్‌వెల్ ఆపరేటర్ బాంబును గమనించి అధికారులకు సమాచారం అందించాడు.
న్యూఢిల్లీ : చండీఘఢ్లో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ నివాసం వద్ద అధికారులు బాంబును గుర్తించడంతో పెను ముప్పు తప్పింది. పంజాబ్ సీఎం నివాసం, హెలిప్యాడ్‌కు సమీపంలోని మామిడి తోటలో సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ట్యూబ్‌వెల్ ఆపరేటర్ బాంబును గమనించి అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే అప్రమత్తమైన అధికారులు బాంబును నిర్వీర్యం చేసే సిబ్బందిని పిలిపించారు.
చండీఘడ్‌లోని కన్సల్, మోహాలి నయా గావ్ బోర్డర్ వద్ద బాంబును గుర్తించారు. పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్వ్కాడ్ సాయంతో బాంబును నిర్వీర్యం చేశామని, ఆ ప్రాంతాన్ని సైనిక బృందం స్వాధీనం చేసుకుందని డిజాస్టార్ మేనేజ్మెంట్, చండీఘఢ్ నోడల్ అధికారి సంజీవ్ కోహ్లి చెప్పారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశామని తెలిపారు.
ఈ ఘటన జరిగిన సమయంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ నివాసంలో లేరని అధికారులు తెలిపారు. ఘటన నేపధ్యంలో ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. హర్యానా మాజీ సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ నివాసం కూడా ఇక్కడకు కూతవేటు దూరంలో ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
Ramayana | రూ.5000 కోట్ల వసూళ్లు సాధిస్తేనే సేఫ్.. భయపెడుతున్న ‘రామాయణ’ బ్రేక్ ఈవెన్ టార్గెట్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

