HomeNationalBollywood Actor Naseeruddin Shah Alleged That Mumbai University Withdrew Its Invitation To Him Because He Did Not Praise The World Guru
విశ్వగురువును పొగడలేదు.. అందుకే ఆహ్వానం రద్దు
విశ్వగురువును ప్రశంసించనందుకే ముంబై యూనివర్సిటీ తనకు ఇచ్చిన ఆహ్వానాన్ని వెనుకకు తీసుకున్నదని ప్రముఖ బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్‌షా ఆరోపించారు.
ముంబై: విశ్వగురువును ప్రశంసించనందుకే ముంబై యూనివర్సిటీ తనకు ఇచ్చిన ఆహ్వానాన్ని వెనుకకు తీసుకున్నదని ప్రముఖ బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్‌షా ఆరోపించారు. ఈ నెల ఒకటిన ముంబై యూనివర్సిటీలో నిర్వహించిన ‘జష్న్ ఏ ఉర్దూ’ కార్యక్రమానికి ముంబై యూనివర్సిటీ నసీరుద్దీన్షాను అతిథిగా ఆహ్వానించింది.
చివరి నిమిషంలో జనవరి 31న అర్ధరాత్రి ఆయనకు ఫోన్ చేసి రేపటి కార్యక్రమానికి మీరు రానక్కరలేదని తెలిపింది.