కాంజావాల్ తరహా ఘటన.. వ్యక్తిని ఢీ కొట్టి పది కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు..!
ఢిల్లీలోని కాంజావాల్ తరహాలో ఉత్తర ప్రదేశ్లో మరో ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని కారు ఏకంగా పది కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ప్రమాదంలో కారు కింద ఇరుక్కున్న వ్యక్తి మృతదేహం గుర్తుపట్టలేనంతగా మారిపోయిందని పోలీసులు వెల్లడించారు.
Car Hit And Drag | కొత్త ఏడాది రోజు దేశరాజధాని ఢిల్లీలోని కాంజావాల్ ప్రాంతంలో ఓ యువతిని కారు మూడు కిలోమీరట్ల మేర ఈడ్చుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటనలో అంజలి అనే 20 ఏండ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ భయంకరమైన ఘటన మరువకముందే ఇలాంటి తరహాలోనే ఉత్తర ప్రదేశ్లో మరో ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని కారు ఏకంగా పది కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఈ దారుణమైన ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మంగళవారం తెల్లవారుజామున 4గంటల ప్రాంతంలో ఢిల్లీకి చెందిన వీరేంద్ర సింగ్ అనే వ్యక్తి.. ఆగ్రా నుంచి నోయిడాకు కారులో బయలు దేరాడు. ఆ సమయంలో ఓ వ్యక్తిని ఢీ కొట్టి.. దాదాపు పది కిలోమీటర్ల మేర అలానే ఈడ్చుకెళ్లాడు. మథుర ఎక్స్ప్రెస్ వేపై టోల్బూత్ సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
దట్టమైన పొగ మంచు కారణంగా వ్యక్తిని ఢీ కొట్టిన విషయం తనకు తెలియలేదని, కారు కింద ఇరుక్కున్నట్లు కూడా గమనించలేదని నిందితుడు విచారణ సందర్భంగా పోలీసులకు తెలిపాడు. ఈ ప్రమాదంలో కారు కింద ఇరుక్కున్న వ్యక్తి మృతదేహం గుర్తుపట్టలేనంతగా మారిపోయిందని పోలీసులు వెల్లడించారు. ఆ వ్యక్తి ఎవరన్నదానిపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
यमुना एक्सप्रेस-वे पर कंझावाला जैसी घटना, 12 KM तक शव को घसीटती रही कार; सिर्फ चेहरा बचा-बाकी#mathura #YamunaExpressWay pic.twitter.com/j5zON70uBw
— Rahul Sisodia (@Sisodia19Rahul) February 7, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

