Blue Moon | వినీలాకాశంలో నేడు అరుదైన దృశ్యం.. అలరించనున్న బ్లూ మూన్..! మళ్లీ చూడాలంటే తొమ్మిదేళ్లు ఆగాల్సిందే..!
Blue Moon | ఆకాశంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానున్నది. ఇటీవల శనిగ్రహం ఖగోళ ప్రియులను కనువిందు చేయగా.. అంతకు ముందు పంచగ్రహ కూటమి ఏర్పడింది. బుధుడు, యురేనస్, గురుగ్రహం, నైప్యూటర్, శనిగ్రహాలు ఒకే వరుసలోకి చేరాయి. ఈ ఘట్టాన్ని ఎలాంటి పరికరాలు లేకుండా చూడే అవకాశం కలిగింది. ఈ క్రమంలోనే బుధవారం మరో అరుదైన దృశ్యం బ్లూ మూన్ ఆవిష్కృతం కాబోతున్నది.
Blue Moon | ఆకాశంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానున్నది. ఇటీవల శనిగ్రహం ఖగోళ ప్రియులను కనువిందు చేయగా.. అంతకు ముందు పంచగ్రహ కూటమి ఏర్పడింది. బుధుడు, యురేనస్, గురుగ్రహం, నైప్యూటర్, శనిగ్రహాలు ఒకే వరుసలోకి చేరాయి. ఈ ఘట్టాన్ని ఎలాంటి పరికరాలు లేకుండా చూడే అవకాశం కలిగింది. ఈ క్రమంలోనే బుధవారం మరో అరుదైన దృశ్యం బ్లూ మూన్ ఆవిష్కృతం కాబోతున్నది. ఈ నెలలో రెండు పున్నములు ఉండగా.. ఒకటి ఆగస్టు ఒకటో తేదీన ఏర్పడింది. దీన్ని సూపర్‌మూన్‌గా పిలువగా.. నేడు బ్లూబూన్ బుధవారం ఏర్పడబోతున్నది. సాధారణంగా ఒక ఏడాదిలో రెండు, మూడు సూపర్ మూన్స్ ఏర్పడుతుంటాయి.. కానీ, బుధవారం ఏర్పడబోయే బ్లూమూన్ మాత్రం అరుదైనది. పౌర్ణమి సమయంలో చందమామ భూమికి దగ్గరగా వచ్చిన సూపర్ మూన్ ఆవిష్కృతమవుతుంది. సాధారణంగా పౌర్ణమి రోజుల కంటే సూపర్ మూన్ సమయంలో చంద్రుడు మరింత ప్రకాశవంతంగా కనిపించడంతో పాటు భారీ పరిమాణంలో కనిపిస్తాడు. సాధారణ రోజుల కంటే 16 శాతం వెన్నెలను పంచబోతున్నాడు.
బ్లూ మూన్ అంటే..?
ఒకే నెలలో రెండోసారి ఏర్పడే పున్నమి చంద్రుడిని బ్లూ మాన్‌గా పిలుస్తుంటారు. ఒకే నెలలో రెండు పున్నములు ఏర్పడుతుంటాయని నాసా తెలిపింది. ఒక సూపర్‌మూన్, బ్లూ మూన్తో కలిసి రావడం అరుదైన విషయమని పేర్కొంది. అయితే, చివరిసారిగా బ్లూ బూన్ 2009 డిసెంబర్లో ఏర్పడగా మళ్లీ 2032, 2037 ఆగస్టులో ఏర్పడబోతున్నది. అయితే, బ్లూమూన్ అంటే చంద్రుడు బ్లూ కలర్లో మాత్రం కనిపించడు. హిందూ సంప్రదాయంలో ఒకే నెలలో సంభవించే రెండు పున్నములకు ప్రాధాన్యం ఉన్నది. ఈ అరుదైన ఖగోళ దృశ్యాన్ని తిలకించాలని.. మళ్లీ తొమ్మిది సంవత్సరాల వరకు చూడలేరని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

