న్యూఢిల్లీ: అంతుపట్టని ఏ చిన్న అనారోగ్యానికి గురైనా వైద్యులు సీటీస్కాన్ చేయించడం పరిపాటిగా మా రింది. అయితే, ఈ విషయం తెలిస్తే మాత్రం సీటీస్కాన్ అంటేనే ఆమడదూరం పారిపోతారు. సీటీస్కాన్ వల్ల చిన్నారులు, యువతలో బ్లడ్ క్యాన్సర్ వచ్చే ముప్పు ఎక్కువగా ఉందని నేచర్ మెడిసిన్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం స్పష్టం చేసింది. స్పష్టమైన ఇమేజీల కోసం సీటీస్కాన్లో వాడే ఎక్స్ కిరణాల ద్వారా వెలువడే రేడియేషన్ యువతను తీవ్రమైన ముప్పులోకి నెట్టేస్తున్నదని అధ్యయనం వెల్లడించింది. సీటీస్కాన్ ద్వారా విడుదలయ్యే రేడియేషన్ లింఫోయిడ్, మైలోయిడ్ బ్లడ్ క్యాన్సర్లకు కారణమవుతున్నట్టు బార్సిలోనాలోని పాంప్యూ ఫాబ్రా వర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు.