Blast : బెంగళూరులో భారీ పేలుడు.. ముగ్గురు మృతి

బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరు సిటీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. పేలుడు ధాటికి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా చిద్రమయ్యాయి. చుట్టుపక్కన భారీగా ఆస్థి నష్టం జరిగినట్లు తెలుస్తున్నది. గాయపడ్డ వారిని స్థానిక విక్టోరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. సిటీలోని చామరాజపేటలో ఓ భవనంలో ఈ ప్రమాదం జరగినట్లు సమాచారం. పేలుడుకు కారణాలేంటో తెలుసుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
పేలుడు దాటికి మృతదేహాలు సుమారు 100 మీటర్ల దూరం ఎగిరి పడ్డాయని స్థానికులు తెలిపారు. సమీపంలో ఉన్న వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. వెస్ట్‌జోన్ కమిషనర్ సంజీవ్ పటేల్ ఇచ్చిన సమాచారం ప్రకారం… ఓ గోడౌన్ నుంచి బాణసంచాను తరలిస్తుండగా ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తున్నది.

Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Banglore
- blast
- National news
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

