Blast at IOC refinery | ఐవోసీ రిఫైనరీలో భారీ పేలుడు.. ఎగసిపడిన పొగలు
Blast at IOC refinery | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్)కు చెందిన రిఫైనరీలో భారీ పేలుడు సంభవించింది. స్టోరేజీ ట్యాంక్ నుంచి దట్టంగా పొగలు వ్యాపించాయి. పలు కిలోమీటర్ల దూరం వరకు ఇవి కనిపించాయి.
అహ్మదాబాద్: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్)కు చెందిన రిఫైనరీలో భారీ పేలుడు సంభవించింది. (Blast at IOC refinery) స్టోరేజీ ట్యాంక్ నుంచి దట్టంగా పొగలు వ్యాపించాయి. పలు కిలోమీటర్ల దూరం వరకు ఇవి కనిపించాయి. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. గుజరాత్‌లోని వడోదర జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సోమవారం సాయంత్రం 4 గంటలకు కోయాలిలోని ఐవోసీఎల్ ఆయిల్ రిఫైనరీ ఆవరణలో ఉన్న స్టోరేజీ ట్యాంక్‌లో పేలుడు జరిగింది. నల్లటి పొగలు దట్టంగా వెలువడ్డాయి. పలు కిలోమీటర్ల దూరం వరకు ఈ పొగలు కనిపించాయి.
కాగా, ఈ సమాచారం తెలిసిన వెంటనే పది ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడు వల్ల చెలరేగిన మంటలను ఆర్పివేశారు. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. పేలుడు ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు.
A blast occurred at Indian Oil Corporation’s #Gujarat Refinery in #Vadodara. No casualty has been reported so far.
Know more🔗https://t.co/sKgWRUvnuv pic.twitter.com/5TBPoZym3d
— The Times Of India (@timesofindia) November 11, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

