Blackmail: ప్రైవేట్ వీడియోతో బ్లాక్మెయిల్.. 3 కోట్లు కోల్పోయిన సీఏ.. ముంబైలో ఆత్మహత్య
Blackmail: ముంబైలో ఓ వ్యక్తిని అతని స్నేహితులు బ్లాక్ మెయిల్ చేశారు. ఓ ప్రైవేటు వీడియోతో అతన్ని బెదిరించి .. అతని ఖాతాలో ఉన్న మూడు కోట్ల సొమ్మును డ్రా చేశారు. సీఏగా చేస్తున్న ఆ వ్యక్తి తన సూసైడ్ నోట్లో ఈ విషయాన్ని తెలిపాడు.
ముంబై: ముంబైలోని సాంటాక్రజ్‌లో ఉన్న 32 ఏళ్ల వ్యక్తిని అతని స్నేహితులు బ్లాక్ మెయిల్(Blackmail) చేశారు. ఓ ప్రైవేటు వీడియోతో అతన్ని బెదిరించి .. అతని ఖాతాలో ఉన్న సొమ్మును డ్రా చేసుకున్నారు. ఈ ఘటనతో మానసిక ఆందోళనకు లోనైన రాజ్ లీలా మోరే ఆత్మహత్య చేసుకున్నాడు. అతను చార్టెడ్ అకౌంటెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. సీఏ రాజ్ లీలా మృతి పట్ల వకోలా పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాజ్ వద్ద నుంచి మూడు పేజీల సూసైడ్ నోట్ రికవరీ చేశారు.
తన ఆత్మహత్యకు రాహుల్ పర్వాని, సాబా ఖురేషి కారణమని రాజ్ నోట్లో పేర్కొన్నాడు. కంపెనీ అకౌంట్ నుంచి డబ్బులు చోరీ చేసేలా వత్తిడి చేసినట్లు చెప్పాడు. తన స్వంత సేవింగ్స్‌ను కూడా బ్రేక్ చేసేలా ఆ ఇద్దరూ ప్రవర్తించారని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. బెదిరింపులు, ఆత్మహత్యకు ప్రేరేపణ వంటి అభియోగాలు ఆ ఇద్దరిపై బుక్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. స్టాక్ మార్కెట్లో రాజ్ భారీగా ఇన్వెస్ట్ చేసిన విషయాన్ని ఆ ఇద్దరికీ తెలుసు. అతనికి మంచి ఉద్యోగం ఉంది. భారీగా జీతం కూడా వస్తోంది. ప్రైవేటు వీడియోను సర్క్యూలేట్ చేస్తానని బెదిరిస్తూ ఆ ఇద్దరూ రాజ్ మోరేను బ్లాక్మెయిల్ చేశారు. కంపెనీకి చెందిన అకౌంట్లలో ఉన్న డబ్బును.. తమ పర్సనల్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయించారు. రాజ్ వద్ద నుంచి అతని లగ్జరీ కారును కూడా బలవంతంగా తీసుకెళ్లారు.
సూసైడ్ నోట్లో తన తల్లికి సారీ చెప్పాడతను. మంచి కొడుకగా ఉండలేకపోయినట్లు తెలిపాడు. వచ్చే జన్మలో నా లాంటి కొడుకును నీకు ఇవ్వొద్దు అని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పాడు. పూనం ఆంటీ మా అమ్మను మంచి చూసుకో, వేర్వేరు అకౌంట్లలో పాలసీలు ఉన్నాయని, ఆ డబ్బును అమ్మకు ఇవ్వమని తన నోట్లో అతను పేర్కొన్నాడు. తన ఆత్మహత్యకు రాహుల్ పర్వాని, సాబా ఖురేషి కారణమన్నాడు. నిందితులు ఇద్దరు సుమారు మూడు కోట్ల వరకు బాధితుడి నుంచి అక్రమ రీతిలో కాజేసినట్లు పోలీసులు తెలిపారు
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- blackmailed
- CA
- Mumbai
- private video
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

