Black Box | హెలికాప్టర్ కూలిన స్థలంలోనే దొరికిన బ్లాక్‌బాక్స్
Black box Founded | తమిళనాడు నీలగిరి జిల్లా కూనూర్ వద్ద భారత వాయుసేనకు సంబంధించిన ఎంఐ17వీ5 (Mi-17V5) హెలికాప్టర్ కూలిపోయిన విషయం తెలిసిందే. హెలికాప్టర్‌కు సంబంధించిన బ్లాక్‌బాక్స్‌ను

చెన్నై : తమిళనాడు నీలగిరి జిల్లా కూనూర్ వద్ద భారత వాయుసేనకు సంబంధించిన ఎంఐ17వీ5 (Mi-17V5) హెలికాప్టర్ కూలిపోయిన విషయం తెలిసిందే. హెలికాప్టర్‌కు సంబంధించిన బ్లాక్‌బాక్స్‌ను తమిళనాడు ఫోరెన్సిక్ సైన్స్ విభాగానికి చెందిన బృందం గుర్తించినట్లు గురువారం ప్రకటించింది. ప్రమాదం జరిగిన స్థలం నుంచి 30 అడుగుల దూరంలో బ్లాక్‌బాక్స్ లభ్యమైంది. అనంతరం బ్లాక్‌బాక్స్‌ను ఆర్మీ అధికారులు స్వాధీనం చేసుకొని, వెల్లింగ్టన్ బేస్ క్యాంప్‌కు తరలించారు. వింగ్ కమాండర్ ఆర్ భరద్వాజ్ నేతృత్వంలోని 25 మంది సభ్యుల వైమానిక బృందం బ్లాక్‌బాక్స్ కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. బ్లాక్‌బాక్స్‌ను వెల్లింగ్టన్ నుంచి ఢిల్లీకి తరలించి, అందులో ఉన్న డేటాను డీకోడ్ చేయనున్నారు.
బ్లాక్ బాక్స్‌లో 13 గంటల పాటు నిడివి ఉన్న డేటా నిక్షిప్తమై ఉంటుంది. క్రాష్ అయిన సమయంలో ప్రమాదానికి ముందు ఏం జరిగిందన్న సమాచారాన్ని బ్లాక్ బాక్స్ అందివ్వనున్నది. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, సహా 14 మంది ప్రయాణిస్తున్న ఐఏఎఫ్‌కు చెందిన హెలికాప్టర్ బుధవారం తమిళనాడులోని కూనూర్‌లో కూలిపోయిన విషయం తెలిసిందే. జనరల్ బిపిన్ రావత్ సహా 13 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉన్నది. అలాగే ప్రమాదానికి ముందు పైలెట్లు జరిపిన సంభాషణ సైతం రికార్డయ్యే అవకాశాలుంటాయి. హెలికాప్టర్ ప్రమాద దర్యాప్తులో బ్లాక్ బాక్స్ కీలకం కానున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

