అంధేరి ఉప ఎన్నికలో ఉద్ధవ్ వర్గానిదే గెలుపు… పోటీ నుంచి తప్పుకున్న బీజేపీ అభ్యర్థి
శివసేనను చీల్చి ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న బీజేపీ చివరకు వెనక్కి తగ్గింది. తమ అభ్యర్థిని పోటీ నుంచి విరమించింది.
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని అంధేరి ఈస్ట్ ఉప ఎన్నికలో శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం గెలువనున్నది. బీజేపీ అభ్యర్థి ముర్జీ పటేల్ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నారు. నామినేషన్‌ను ఆయన విత్ డ్రా చేసుకున్నట్లు మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్కులే తెలిపారు. మరణించిన సిట్టింగ్ ఎమ్మెల్యే లేదా ఎంపీ కుటుంబానికి వ్యతిరేకంగా అభ్యర్థిని నిలుపకూడదన్న మహారాష్ట్ర రాజకీయ సంప్రదాయానికి అనుగుణంగా తమ అభ్యర్థిని పోటీ నుంచి ఉపసంహరించినట్లు మీడియాతో సోమవారం అన్నారు.
కాగా, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన అంధేరీ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే రమేష్ లట్కే కొన్ని నెలల కిందట మరణించారు. దీంతో ఆ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన భార్య రితుజా లట్కేను ఉద్ధవ్ వర్గం పోటీకి నిలిపింది. అయితే బీజేపీ మద్దతులో సీఎం అయిన శివసేన ఏక్నాథ్ షిండే వర్గం ఆమెపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించింది. బీఎంసీ ఉద్యోగిని అయిన రితుజా రాజీనామాను నామినేషన్‌కు చివరి వరకు పెండింగ్‌లో ఉంచారు. ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించడంతో చివరకు కోర్టు ఆదేశాలతో ఆమోదించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో అంధేరీ ఉప ఎన్నికలో శివసేన రెండు వర్గాలు నేరుగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. బీజేపీ అభ్యర్థి ముర్జీ పటేల్‌కు శివసేన షిండే వర్గం మద్దతుగా ఉంది. అయితే బీజేపీ అభ్యర్థిని పోటీ నుంచి విరమించాలని ఎన్సీపీ చీఫ్ శరద్ పవర్, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే కోరారు. ఈ నేపథ్యంలో శివసేనను చీల్చి ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న బీజేపీ చివరకు వెనక్కి తగ్గింది. తమ అభ్యర్థిని పోటీ నుంచి విరమించింది. దీంతో శివసేన ఉద్ధవ్ వర్గం అభ్యర్థిని రితుజా లట్కే విజయానికి మార్గం సుగమం అయ్యింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Andheri East
- BJP
- Bypoll
- Candidate
RELATED ARTICLES
తాజా వార్తలు
Un Stoppable | బాలయ్య ‘అన్‌స్టాపబుల్ 5’లో మెగాస్టార్ చిరంజీవి.. నిజమైతే అభిమానులకు పండగే!
Chiranjeevi | ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. నెట్‌ఫ్లిక్స్‌లో ‘మెగావర్స్’ టాక్ షో,15 ఎపిసోడ్స్‌తో భారీ ప్లాన్!
Imam Salary | మౌజన్.. ఇమామ్‌ల వేతనగోస.. ఏడు నెలలుగా 16,379 మంది ఎదురుచూపులు
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు త్రిగుణ్ వార్నింగ్.. షాలిని గురించి చెబుతూ ఎమోషనల్!
KRMB Meeting | కేఆర్ఎంబీ సమావేశం మళ్లీ వాయిదా.. ఇరు రాష్ర్టాలకు బోర్డు లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

