MP Jayant Sinha: ఓటు వేయలేదని ఎంపీ జయంత్ సిన్హాకు నోటీసులిచ్చిన బీజేపీ
Show-Cause Notice: మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ జయంత్ సిన్హాకు.. బీజేపీ పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. అయిదో విడుత లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ జయంత్ సిన్హా తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. పార్టీ కార్యకలాపాల్లో, ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదని ఆ ఎంపీపై పార్టీ సీరియస్ అయ్యింది.
న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ జయంత్ సిన్హా(MP Jayant Sinha)కు.. బీజేపీ పార్టీ షోకాజ్ నోటీసులు(Show-Cause Notice) ఇచ్చింది. సోమవారం రోజున జరిగిన అయిదో విడుత లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ జయంత్ సిన్హా తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. పార్టీ కార్యకలాపాల్లో, ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదని ఆ ఎంపీపై పార్టీ సీరియస్ అయ్యింది. జార్ఖండ్‌లోని హజారిబాగ్ సీటు నుంచి మనీశ్ జైస్వాల్‌ను ప్రకటించడంతో ఎంపీ జయంత్ ప్రచారంలో పాల్గొనలేదు. కీలకమైన ఆ సీటు నుంచి తాను పోటీ చేయడం లేదని మార్చిలో సిన్హా ప్రకటించారు. మనీశ్ జైస్వాల్‌ను అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదని, మీరు మీ ఓటును కూడా వేయలేదని, మీ ప్రవర్తన వల్ల పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిందని బీజేపీ ప్రధాన కార్యదర్శి ఆదిత్య సాహూ తెలిపారు. రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఎంపీ జయంత్‌ను పార్టీ కోరింది. దీనిపై ఆయన ఇంకా స్పందించాల్సి ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

