కరోనా మరణాలపై రాహుల్, కేజ్రీవాల్ రాజకీయం : బీజేపీ

న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ కొరతతో ఎవరూ మరణించలేదని రాష్ట్రాలు పంపిన సమాచారంతో రాజ్యసభలో ప్రభుత్వం చేసిన ప్రకటనను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజకీయం చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. ఆరోగ్యం రాష్ట్ర పరిధిలోని అంశమని, రాష్ట్రాలు కేంద్ర పాలితప్రాంతాలు ఎప్పటికప్పుడు కరోనా కేసులు, మరణాలపై కేంద్రానికి రిపోర్ట్ చేస్తున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రవీణ్ పవార్ రాజ్యసభలో వివరించారని బీజేపీ నేత సంబిట్ పాత్రా పేర్కొన్నారు.
కరోనా మరణాలను నివేదించడంపై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ నివేదికల ప్రకారం ఆక్సిజన్ కొరత కారణంగా ఎవరూ మరణించిన వివరాలను ఏ ఒక్క రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం వెల్లడించలేదని బీజేపీ నేత తెలిపారు. కరోనా మరణాలపై పెద్దన్న రాహుల్, చిన్నన్న కేజ్రీవాల్‌లు గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. కరోనా మహమ్మారిపై పోరాటానికి ప్రతి ఒక్కరూ ఐక్యం కావాల్సిన తరుణంలో కొందరు రాజకీయ నేతలు చిల్లర రాజకీయాలు చేయడం సరైంది కాదని ఆయన హితవు పలికారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బియ్యం వ్యాపారులపై క్రిమినల్ కేసులు
సెల్‌ఫోన్ లాక్కొని వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

