బండి సంజయ్‌కి ఉద్వాసన
అనేక రాష్ర్టాల్లో జరుగనున్న ఎన్నికల ముందు చేపట్టిన సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ నేతృత్వంలో కొత్త కార్యవర్గాన్న్లి బీజేపీ ప్రకటించింది. తెలంగాణకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.
- స్మృతి ఇరానీ, వసుంధరా రాజే, పురందేశ్వరికి చోటు
- రామ్ మాధవ్‌కు ప్రమోషన్; బీఎల్ సంతోష్ స్థానం పదిలం
- అమిత్ ఔట్, దీపక్ మస్కే ఇన్
- నితిన్ నబీన్ నేతృత్వంలో బీజేపీ కొత్త జాతీయ బృందం
న్యూఢిల్లీ: అనేక రాష్ర్టాల్లో జరుగనున్న ఎన్నికల ముందు చేపట్టిన సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ నేతృత్వంలో కొత్త కార్యవర్గాన్న్లి బీజేపీ ప్రకటించింది. తెలంగాణకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇప్పటివరకు పార్టీలో కీలకంగా వ్యవహరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌కు చుక్కెదురైంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్న బండి సంజయ్ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యారు. ఆయనకు పార్టీ జాతీయ కార్యవర్గంలో ఎటువంటి స్థానం దక్కలేదు. గతంలో పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేసిన బండి సంజయ్ మల్లీ రాష్ట్ర పార్టీ సారథ్యాన్ని చేపట్టనున్నట్టు ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో ఈ తాజా పరిణామం చోటుచేసుకుంది. బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు కావడం, ఆ కేసులో అతను జైలుకు వెళ్లడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బండి సంజయ్‌ని పార్టీ జాతీయ కార్యవర్గం నుంచి తప్పించడం వెనుక ఇది కూడా ఒక కారణం కావచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. . కొత్త కార్యవర్గంలో స్మృతి ఇరానీ, వసుంధరా రాజే, పురందేశ్వరి వంటి అనుభవజ్ఞులైన మహిళా నాయకులకు చోటు దక్కింది.
వసుంధరా రాజే జాతీయ ఉపాధ్యక్షుల్లో ఒకరిగా నియమితులయ్యారు. కొత్తగా నియమితులైన 13 మంది ఉపాధ్యక్షులలో ఆరుగురు మహిళలు ఉన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఏకైక మహిళ స్మృతి ఇరానీ కావడం విశేషం. బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ అమిత్ మాల్వియాకు ఉద్వాసన పలికారు. ఆయన స్థానంలో దీపక్ మస్కే నియమితులయ్యారు. పార్టీ జాతీయ కార్యదర్శులుగా నియమితులైన 16 మందిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. గతంలో పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసి 2023లో బీజేపీలో చేరిన మన్‌ప్రీత్ సింగ్ బాదల్ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా తన జీవితాన్ని అంకితం చేసిన రామ్ మాధవ్ గతంలో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేయగా నితిన్ నబీన్ సారథ్యంలోని కొత్త బృందంలో జాతీయ ఉపాధ్యక్షుడిగా ప్రమోషన్ పొందారు. పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలోని తన కొత్త జాతీయ బృందాన్ని బీజేపీ సోమవారం ప్రకటించింది. జాతీయ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత)గా బీఎల్ సంతోష్ అదే పదవిలో కొనసాగుతారు. పార్టీ కోశాధికారిగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో కూడా త్వరలో మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

