Suresh Gopi | వివక్షపై భగ్గుమన్న విపక్షం : బడ్జెట్‌పై సురేష్ ప్రభు కీలక వ్యాఖ్యలు
Suresh Gopi : ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో పలు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని విపక్షాలు భగ్గుమన్నాయి.
Suresh Gopi : ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో పలు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని విపక్షాలు భగ్గుమన్నాయి. ఏపీ, బిహార్ మినహా ఇతర రాష్ట్రాల ఊసెత్తలేదని మండిపడ్డాయి. కేంద్ర బడ్జెట్లో వివక్షకు వ్యతిరేకంగా విపక్ష ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్ లోపల, వెలుపల నిరసనలు చేపట్టాయి. కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం చూపిన వివక్షకు వ్యతిరేకంగా విపక్షాలు చేపట్టిన నిరసనలపై బీజేపీ ఎంపీ సురేష్ గోపీ స్పందించారు.
నిరసన చేపట్టడం విపక్ష హక్కని, వారి బాధ్యతను వారిని నిర్వర్తించనీయండని ఆయన వ్యాఖ్యానించారు. ఈ బడ్జెట్ దేశ పురోభివృద్ధికి రూపొందించారని, మధ్యతరగతి వారికి కొద్దిగా భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఈ బడ్జెట్లో ఆ దిశగా కొంత మేర వారికి ఊరట కల్పించడం జరిగిందని చెప్పుకొచ్చారు. ఉద్యోగులు, యజమానుల మధ్య సమతూకం పాటిస్తూ ఇరువురి ప్రయోజనాలనూ కాపాడే ప్రయత్నం జరిగిందని అన్నారు. ప్రజల దృష్టి కోణంలో బడ్జెట్‌ను చూడాలని, రాజకీయ కోణంలో కాదని విపక్షాలకు బీజేపీ ఎంపీ సురేష్ ప్రభు హితవు పలికారు.
కాగా, అంతకుముందు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ (Union Budget 2024) పై ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి (INDIA parties) నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. బుధవారం ఉదయం సమావేశాలకు ముందు కూటమి పార్టీలకు చెందిన ఎంపీలంతా పార్లమెంట్ (Parliament) వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఇది అని ఆరోపించారు.
Read More :
Singareni | సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తేలేదు.. లోక్‌సభలో కేంద్రం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

