బెంగళూరు, మే 13: కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పరాభవంపై సోషల్ మీడియాలో నవ్వులు కురిపించే పలు మీమ్స్ వైరల్ అయ్యాయి. ‘ఈ సాలా గవర్నమెంట్ నమ్దే’ అంటూ ఐపీఎల్లో ఆర్సీబీ డైలాగ్‌తో మీమ్ చేశారు. సీఎం పదవికి పోటీ పడుతున్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ను బాహుబలి సినిమాలో తలపడుతున్న ప్రభాస్, రానాతో పోలుస్తూ మీమ్ చేయడం వీరి మధ్య పోటీకి అద్దం పట్టింది. ‘విద్వేషం ఓడింది.. కర్ణాటక గెలిచింది’ క్యాప్షన్‌తో లగాన్ సినిమాలో మ్యాచ్ గెలిచినప్పుడు అమీర్ ఖాన్ టీమ్ సంతోషపడుతున్న వీడియోను నెటిజన్లు జత చేశారు.