గన్ లైసెన్సుల్లో మణిపూర్ టాప్
హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో తిరుగుబాటుదారులు, మిలిటెంట్లకు ఆ రాష్ట్ర ప్రభుత్వమే పరోక్షంగా సహకరిస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. లైసెన్సులు ఇచ్చి మరీ అనేకమంది చేతికి ఆయుధాలను అందించిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇంఫాల్, జూలై 12: హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో తిరుగుబాటుదారులు, మిలిటెంట్లకు ఆ రాష్ట్ర ప్రభుత్వమే పరోక్షంగా సహకరిస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. లైసెన్సులు ఇచ్చి మరీ అనేకమంది చేతికి ఆయుధాలను అందించిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈశాన్య రాష్ర్టాల్లోనే ఎక్కువగా మణిపూర్ ప్రభుత్వం అత్యధిక ఆయుధ లైసెన్స్‌లు జారీ చేసింది. బీరేన్‌సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వీటి సంఖ్య భారీగా పెరిగింది. 2016లో 26,836 ఆయుధాలకు లైసెన్స్ ఉండగా 2023 నాటికి ఆ సంఖ్య 35,117కు పెరిగింది. కేవలం ఏడేండ్లలో సుమారు 8 వేలకు పైగా ఆయుధాలకు బీరేన్‌సింగ్ సర్కార్ లైసెన్సులు ఇవ్వడం గమనార్హం. సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించింది.
మణిపూర్ హోం శాఖను అట్టిపెట్టుకున్న బీరేన్‌సింగ్ నేతృత్వంలోనే భారీ స్థాయిలో ఆయుధ లైసెన్సులు జారీ అయ్యాయి. భారీ స్థాయిలో లైసెన్సులు పొందిన అనేకమంది మిలిటెంట్లు, తిరుగుబాటుదారులు హింసకు పాల్పడుతున్నా రు. వీటికి తోడు మే 3 నుంచి సుమా రు 3500 ఆయుధాలు, 5 లక్షలకు పైగా మం దుగుండు సామగ్రి దోపిడీకి గురయ్యాయి. దీంతో రాష్ట్రంలో భారీగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. ఆయుధాలను తిరిగి ఇవ్వాలని కోరుతూ రాష్ట్రంలో డ్రాప్ బాక్సులను పెట్టడమే అక్కడి పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది. మరోవైపు మంత్రి సుసిండ్రో తన ఇంటి ఆవరణలో డ్రాప్ బాక్సును ఏర్పాటు చేసి పరోక్షంగా ఆయుధాల దోపిడికి సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు మణిపూర్‌లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై కుకీ తెగ ప్రజలకు ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరం (ఐటీఎల్ఎఫ్) క్షమాపణలు చెప్పింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

