ML Khattar | ఈ నెల 11న అక్కడ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం.. కొత్త సీఎం ఎవరో ఖరారయ్యే ఛాన్స్..!
ML Khattar | ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడు రోజులైనా ఆ మూడింట్లో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా సీఎంను ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో సీఎం ఎంపిక కసరత్తు ఎంతవరకు వచ్చిందనే విషయంపై బీజేపీ కేంద్ర పరిశీలకుడు మనోహర్‌లాల్ ఖట్టర్ స్పందించారు.
భోపాల్: ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడు రోజులైనా ఆ మూడింట్లో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా సీఎంను ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో సీఎం ఎంపిక కసరత్తు ఎంతవరకు వచ్చిందనే విషయంపై బీజేపీ కేంద్ర పరిశీలకుడు, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ స్పందించారు.
మధ్యప్రదేశ్‌కు కొత్త సీఎం ఎవరో ఖరారు చేసేందుకు రాష్ట్ర బీజేపీ శాసనసభాపక్షం వచ్చే సోమవారం (ఈ నెల 11న) సమావేశం కానుందని ఖట్టర్ చెప్పారు. ఆ సమావేశంలో ఏక గ్రీవంగా సీఎంను ఎన్నుకుంటారని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, మధ్యప్రదేశ్‌లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కానీ మాధవరావు సింథియా తన వర్గానికి చెందిన 20 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ సర్కారు కుప్పకూలింది.
అనంతరం శివరాజ్‌సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజా ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధించింది. దాంతో మళ్లీ శివరాజ్సింగ్కే సీఎం పగ్గాలు అప్పజెబుతారని ప్రచారం జరిగింది. కానీ, ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడు రోజులైనా రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌తోపాటు మధ్యప్రదేశ్‌లో కూడా సీఎం పేరును ఇంకా ఖరారు చేయలేదు. మరె సోమవారం నాటి శాసనసభాపక్ష భేటీలో అయినా మధ్యప్రదేశ్ సీఎం ఎవరనేది తేలుతుందో లేదో వేచి చూడాలి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

