స్టాక్‌మార్కెట్ దిగ్గజం Rakesh Jhunjhunwala కన్నుమూత
Rakesh Jhunjhunwala | ప్రముఖ వ్యాపారవేత్త, స్టాక్‌మార్కెట్ దిగ్గజం రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా (62) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఆదివారం ఉదయం 6.45 గంటలకు
ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త, స్టాక్‌మార్కెట్ దిగ్గజం రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా (62) కన్నుమూశారు. ఆదివారం ఉదయం 6.45 గంటలకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ముంబైలోని బ్రీచ్ క్యాండీ దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించారని వైద్యులు నిర్ధారించారు. హైదరాబాద్ రాజస్థానీ కుటుంబంలో జన్మించిన ఝున్‌ఝున్‌వాలా.. ఈ మధ్యే విమానయాన రంగంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఆయన సారథ్యంలోని ఆకాశ ఎయిర్ ఈ నెల 7న తన తొలి సర్వీసును ప్రారంభించింది.

రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా 1960, జులై 5న రాధేశ్యామ్‌జీ, ఊర్మిళ దంపతులకు హైదరాబాద్‌లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులది రాజస్థాన్. అయితే రాకేశ్ తండ్రి రాధేశ్యామ్‌జీ హైదరాబాద్‌లో ఆదాయపన్ను శాఖ అధికారిగా పనిచేశారు. దీంతో ఝున్‌ఝున్‌వాలా తన కాలేజీ రోజుల నుంచే స్టాక్‌మార్కెట్‌పై అవగాహన పెంచుకున్నారు. ముంబైలో సీఏ అభ్యసించారు.

ఇండియన్ వారెన్ బఫెట్‌గా పేరుగాంచిన ఆయన.. 1985లో స్టాక్మార్కెట్లోకి అడుగుపెట్టారు. రూ.5 వేలతో స్టాక్ ట్రేడింగ్‌లో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. అంచలంచలుగా ఎదిగిన ఆయన ప్రస్తుత సంపాదన రూ.35 వేల కోట్లు. ప్రస్తుతం ఆయన ఆప్టెక్ లిమిటెడ్, హంగామా డిజిటల్ మీడియా ఎంటర్టైనర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు చైర్మన్‌గా ఉన్నారు. పలు భారతీయ కంపెనీలకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనకు భార్య రేఖ, ముగ్గురు సంతానం ఉన్నారు. రేఖ కూడా స్టాక్ ఇన్వెస్టరే కావడం విశేషం.

ఝున్‌ఝున్‌వాలా మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. పెట్టుబడుల రంగంలో చెరగని ముద్ర వేశారని అన్నారు. అనేకమంతి పెట్టుబడిదారులకు స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి వ్యక్తం చేశారు.
Rakesh Jhunjhunwala was indomitable. Full of life, witty and insightful, he leaves behind an indelible contribution to the financial world. He was also very passionate about India’s progress. His passing away is saddening. My condolences to his family and admirers. Om Shanti. pic.twitter.com/DR2uIiiUb7
— Narendra Modi (@narendramodi) August 14, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

