Supreme Court: ఆదివారం లోగా సరెండర్ కావాలి.. బిల్కిస్ దోషులకు సుప్రీంలో చుక్కెదురు
Supreme Court : బిల్కిస్ బానో రేప్ కేసు దోషులకు సుప్రీంలో ఊరట దక్కలేదు. 11 మంది దోషులు ఈ ఆదివారంలోగా లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. సరెండర్ అయ్యేందుకు మరింత సమయం ఇవ్వాలని పెట్టుకున్న అభ్యర్థనను కోర్టు కొట్టిపారేసింది. జస్టిస్ నాగరత్నతో కూడిన బెంచ్ ఈ తీర్పునిచ్చింది.
న్యూఢిల్లీ: బిల్కిస్ బానో అత్యాచారం కేసులో దోషులుగా ఉన్న 11 మందికి సుప్రీంకోర్టు(Supreme Court)లో చుక్కెదురైంది. ఈ ఆదివారం లోగా అందరూ సరెండర్ కావాలని ఇవాళ అత్యున్నత న్యాయ స్థానం ఆదేశించింది. లొంగిపోయేందుకు మరింత సమయం ఇవ్వాలని కోర్టును ఆ దోషులు అభ్యర్థించారు. అయితే వారి అభ్యర్థనను కోర్టు కొట్టిపారేసింది. 2002 గోద్రా అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోను రేప్ చేసిన ఆరోపణలపై ఆ నిందితులు జైలుశిక్ష అనుభవించారు. అయితే ఇటీవల క్షమాభిక్ష ఆధారంగా వాళ్లు జైలు నుంచి రిలీజ్ అయ్యారు.
ఆ రిలీజ్‌ను సవాల్ చేస్తూ బిల్కిస్ కోర్టును ఆశ్రయించారు. ఆమె అభ్యర్థన విన్న సుప్రీం.. దోషులు మళ్లీ సరెండర్ కావాలని ఆదేశించింది. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ కోర్టుకెళ్లిన దోషులకు చుక్కెదురైంది. జస్టిస్ బీవీ నాగరత్న నేతృత్వంలోని బెంచ్ ఇవాళ తీర్పును ఇచ్చింది. పిటీషనర్ల వాదనలో పస లేదని, దోషులు మళ్లీ జైలుకు వెళ్లాల్సిందే అని కోర్టు పేర్కొన్నది. అక్రమ రీతిలో బిల్కిస్ దోషుల్ని విడుదల చేసినట్లు గుజరాత్ సర్కార్‌పై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

