Watch: మున్సిపల్ వాహనంలో కుక్కల తరలింపు.. బైకర్ ఏం చేశాడంటే?
Biker Sets Free Dogs | మున్సిపల్ కార్పొరేషన్ వాహనంలో వీధి కుక్కలను తరలిస్తున్నారు. అయితే ఆ వాహనాన్ని అనుసరించిన బైకర్ బోను లాక్ తీశాడు. (Biker Sets Free Dogs) దీంతో ఆ వాహనంలోని కుక్కలు రోడ్డుపైకి దూకి తప్పించుకున్నాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లక్నో: మున్సిపల్ కార్పొరేషన్ వాహనంలో వీధి కుక్కలను తరలిస్తున్నారు. అయితే ఆ వాహనాన్ని అనుసరించిన బైకర్ బోను లాక్ తీశాడు. (Biker Sets Free Dogs) దీంతో ఆ వాహనంలోని కుక్కలు రోడ్డుపైకి దూకి తప్పించుకున్నాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఈ సంఘటన జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ వాహనంలో సుమారు పది వీధి కుక్కలను తరలిస్తున్నారు. ఆ వాహనం మెల్లగా వెళ్తుండగా ఒక వ్యక్తి బైక్‌పై దానిని అనుసరించాడు. మున్సిపల్ వాహనంలో కుక్కలను ఉంచిన బోను గేట్ లాక్ తీశాడు. దీంతో కొన్ని కుక్కలు రోడ్డు మీదకు జంప్ చేసి తప్పించుకున్నాయి.
కాగా, ఒక వ్యక్తి తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మున్సిపల్ కార్పొరేషన్ వాహనంలో తరలిస్తున్న కుక్కలను బైకర్ విడిపించడం ఒప్పా?, తప్పా? అన్న చర్చకు దారి తీసింది. నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. కొందరు ఆ బైకర్ చర్యను సమర్థించగా మరికొందరు తప్పుపట్టారు.
మరోవైపు వీధి కుక్కలకు వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ తర్వాత వాటిని పట్టుకున్న ప్రాంతాల్లో మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది వదిలిపెడతారని ఒకరు తెలిపారు. అయితే బైకర్ చర్య వల్ల వేర్వే ప్రాంతానికి చేరిన ఆ కుక్కలకు స్థానిక కుక్కల నుంచి ముప్పు ఉంటుందని అతడు హెచ్చరించాడు. అలాగే వాహనం వేగంగా వెళ్తునప్పుడు ఒకవేళ కుక్కలు రోడ్డు మీదకు దూకి ఉంటే ప్రమాదం బారిన పడే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో బైకర్ చర్య తప్పని అన్నాడు.
https://twitter.com/alokkmohan/status/1751308666568098037?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1751308666568098037%7Ctwgr%5E04075be3b8058497fbee2867ede23e30b0ae0fc0%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.freepressjournal.in%2Fviral%2Fviral-video-biker-sets-free-dogs-being-carried-in-agra-nagar-nigam-van-on-highway-in-up
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చందమామ అందానికి ఫిదా అవ్వాల్సిందే.. బ్లాక్ డ్రెస్‌లో కాజల్ హాట్ ఫొటోలు వైరల్!
Man Catches Employee With Daughter | ఇంట్లో కుమార్తెతో కలిసి ఉన్న ఉద్యోగి.. బ్యాట్‌తో కొట్టి చంపిన యజమాని
రిమ్స్ బాధిత కుటుంబానికి కేటీఆర్ భరోసా.. రూ.లక్ష ఆర్థిక సాయం అందించిన కోవ లక్ష్మి
GLP-1 Medicine | బరువు తగ్గించే జీఎల్పీ-1 మందులను వాడితే కండరాల నష్టం జరుగుతుందా..? ఏం చేయాలి..?
Rythu Garjana Sabha | బీఆర్ఎస్ రైతు గర్జన పోస్టర్ ఆవిష్కరణ.. ఈ నెల 11న నిర్మల్‌లో కేటీఆర్ సభ
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

