పాట్నా: ఒక టీచర్ విద్యార్థినితో సన్నిహితంగా ఉండటాన్ని కొందరు వ్యక్తులు చూశారు. ఈ నేపథ్యంలో దుస్తులు తీయించి వారిద్దరినీ కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 40 ఏళ్ల మ్యూజిక్ టీచర్ (Bihar Teacher) ఒక బాలికతో సన్నిహితంగా ఉన్నాడు. ముగ్గురు వ్యక్తులు ఇది చూశారు. బలవంతంగా వారి దుస్తులను విప్పించారు. ఆపై ఇద్దరినీ దారుణంగా కొట్టారు. అలాగే మొబైల్ ఫోన్లో కూడా దీనిని రికార్డ్ చేశారు. శుక్రవారం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, ఈ సంఘటనపై పోలీసులు స్పందించారు. బాలికతో సన్నిహితంగా ఉన్న మ్యూజిక్ టీచర్‌ను అరెస్ట్ చేశారు. పోక్సో, ఎస్సీఎస్టీ చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షలకు పంపినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఆమె స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తామని చెప్పారు. అలాగే బాలిక, ఆ టీచర్‌తో దుస్తులు తీయించి వారిద్దరిని కొట్టిన ముగ్గురు వ్యక్తుల కోసం వెతుకుతున్నట్లు తెలిపారు. వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని వెల్లడించారు.