Bhupendra Patel: గుజరాత్ కొత్త ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్
Bhupendra Patel: అంతా ఊహించినట్టుగానే గుజరాత్లో బీజేపీ హైకమాండ్ పటేల్ సామాజిక వర్గంవైపు మొగ్గుచూపింది. ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్‌ను ఎంపికచేసింది.

హైదరాబాద్: అంతా ఊహించినట్టుగానే గుజరాత్లో బీజేపీ హైకమాండ్ పటేల్ సామాజిక వర్గంవైపు మొగ్గుచూపింది. ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్‌ను ( Bhupendra Patel ) ఎంపికచేసింది. ఇవాళ గాంధీనగర్‌లో జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా భూపేంద్ర పటేల్‌ను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. భూపేంద్ర పటేల్ పేరును మాజీ సీఎం విజయ్ రూపానీ ప్రతిపాదించగా మిగతా ఎమ్మెల్యేలంతా ఆమోదించారు.
భూపేంద్ర పటేల్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నట్లు కేంద్ర పరిశీలకుడు నరేంద్రసింగ్ తోమర్ అధికారిక ప్రకటన చేశారు. అయితే, విజయ్ రూపానీ రాజీనామా చేసినప్పటి నుంచి కొత్త ముఖ్యమంత్రి రేసులో వినిపించిన కేంద్రమంత్రి మన్సుక్ మాండవీయ, గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్, గుజరాత్ ఉపముఖ్యమంత్రి నితిన్ పటేల్, సీనియర్ నేత పరుషోత్తమ్ రూపాలా పేర్లను ఈ సమావేశంలో పరిగణలోకే తీసుకోలేదు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన భూపేంద్ర పటేల్ ప్రస్తుతం ఘట్లోడియా నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముఖ్యమంత్రి విజయ్ రూపానీ శనివారం తన పదవికి రాజీనామా చేయడంతో.. కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు ఇవాళ ఆ రాష్ట్ర శాసనసభాపక్షం సమావేశమైంది. గాంధీనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, ప్రహ్లాద్ జోషి, బీజేపీ జనరల్ సెక్రెటరీ తరుణ్ చుగ్ హాజరయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

