Five Of A Family Found Dead | తల్లి, భార్య, ఇద్దరు పిల్లలను చంపి.. రైలు ముందు దూకి వ్యక్తి ఆత్మహత్య
Five Of A Family Found Dead | ఒక వ్యక్తి తన తల్లి, భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. ఆ తర్వాత రైలు పట్టాల వద్దకు వెళ్లాడు. రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భోపాల్: ఒక వ్యక్తి తన తల్లి, భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. ఆ తర్వాత రైలు పట్టాల వద్దకు వెళ్లాడు. రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (Five Of A Family Found Dead) మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఈ సంఘటన జరిగింది. సోమవారం ఉదయం ఛోలా ప్రాతంలోని ఒక ఇంట్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పిల్లలు విగతజీవులుగా కనిపించారు. రైలు పట్టాల వద్ద ఒక వ్యక్తి మృతదేహం లభించింది. ఆ ఐదుగురూ ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. 35 ఏళ్ల నరేంద్ర సాహు తన తల్లి అయిన 55 ఏళ్ల సరస్వతి, 29 ఏళ్ల భార్య సోమలత, పదేళ్ల కుమార్తె కృతి, ఆరేళ్ల కుమారుడు ఖుష్ను ఇంట్లో చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతడు, రైలు పట్టాల వద్ద రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.
కాగా, ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. వారి మరణంపై కేసు నమోదు చేశారు. నరేంద్ర తన కుటుంబ సభ్యులను చంపి ఆత్మహత్యకు పాల్పడటానికి కారణం ఏమిటన్నది దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు ముందు ఆ ఇంట్లో ఏం జరిగిందో అన్నది తేలిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశమున్నదని పోలీస్ అధికారి తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Five Of A Family Found Dead | తల్లి, భార్య, ఇద్దరు పిల్లలను చంపి.. రైలు ముందు దూకి వ్యక్తి ఆత్మహత్య
Stock Markets | భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఏకంగా రూ.7 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద..!
Sailesh Kolanu | తుఫాను బాధితులకు అండగా శైలేష్ కొలను.. క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు, నెటిజన్ల ప్రశంసలు!
ISRO Jobs | ఇస్రోలో 61 టెక్నీషియన్-బి, డ్రైవర్ పోస్టులు.. నవంబర్ 13 చివరితేదీ
‘కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

