సుబ్బారెడ్డికి భట్నాగర్ అవార్డు
హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ అండ్ ఫింగర్ ప్రింటింగ్ డయాగ్నోస్టిక్స్ (సీడీఎఫ్‌డీ) సంస్థలో సైంటిస్టుగా సేవలు అందిస్తున్న డాక్టర్ మద్దిక సుబ్బారెడ్డి దేశంలోని అత్యున్నత సైన్స్ పురస్కారానికి ఎంపికయ్యారు.
- మరో 11 మంది శాస్త్రవేత్తలకు కూడా
- 2022 ఏడాదికి ప్రకటించిన సీఎస్ఐఆర్
హైదరాబాద్ సిటీబ్యూరో (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ అండ్ ఫింగర్ ప్రింటింగ్ డయాగ్నోస్టిక్స్ (సీడీఎఫ్‌డీ) సంస్థలో సైంటిస్టుగా సేవలు అందిస్తున్న డాక్టర్ మద్దిక సుబ్బారెడ్డి దేశంలోని అత్యున్నత సైన్స్ పురస్కారానికి ఎంపికయ్యారు. సెల్ బయాలజీలో చేసిన పరిశోధనలకుగాను ఆయన్ని ‘2022-శాంతి స్వరూప్ భట్నాగర్’ పురస్కారం వరించింది. ఆయన సేవల్ని గుర్తిస్తూ అవార్డుకు ఎంపిక చేయటంపై సీడీఎఫ్‌డీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సాధారణ, క్యాన్సర్ కణాల జీవక్రియలపై ఆయన అధ్యయనం చేశారు. 2022 ఏడాదికిగాను 12 మందికి ‘భట్నాగర్’ పురస్కారం వరించింది. ఈ మేరకు సీఎస్ఐఆర్ అవార్డు గ్రహీతల పేర్లను సోమవారం వెల్లడించింది. జీవశాస్త్రం, రసాయనం, గణితం, ఇంజినీరింగ్.. మొదలైన ఏడు విభాగాల్లో అత్యుత్తమ పరిశోధనలు జరిపిన 45 ఏండ్లలోపు సైంటిస్టులకు ఏటా ఈ అవార్డులను, రూ.5 లక్షలు నగదు పురస్కారాన్ని కేంద్రం అందజేస్తున్నది. గత ఏడాది (2022) సెప్టెంబర్‌లో ప్రకటించాల్సిన ఈ జాబితాను మోదీ సర్కార్ నిలిపివేయటం చర్చనీయాంశమైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam: ఖాజీరంగాలో ట్రక్కు, బస్సు ఢీ.. 23 మంది మృతి, ఏడు మందికి గాయాలు
తుంగతుర్తిలో నలుగురికి కుష్టు వ్యాధి నిర్ధారణ
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

