Viral Video | హర్ష్ గోయంకాను ఆకట్టుకున్న జైల్ రెస్టారెంట్..ఎలా ఉందంటే..!
స్టార్టప్ ఐడియాలతో పాటు భిన్నంగా ఆలోచించే వ్యాపారవేత్తలకు నిలయమైన బెంగళూర్‌లో ఓ వ్యాపారి వినూత్న థీమ్‌తో ఏర్పాటు చేసిన రెస్టారెంట్ (Viral Video) పలువురిని ఆకట్టుకుంటోంది.
బెంగళూర్ : స్టార్టప్ ఐడియాలతో పాటు భిన్నంగా ఆలోచించే వ్యాపారవేత్తలకు నిలయమైన బెంగళూర్‌లో ఓ వ్యాపారి వినూత్న థీమ్‌తో ఏర్పాటు చేసిన రెస్టారెంట్ (Viral Video) పలువురిని ఆకట్టుకుంటోంది. నగరంలో కొలువుతీరిన జైల్ రెస్టారెంట్ వీడియోను కార్పొరేట్ దిగ్గజం హర్ష్ గోయంకా ట్విట్టర్లో షేర్ చేశారు.
Jail ke mazaa khao….someone took it literally! pic.twitter.com/PD9VB4dlZy
— Harsh Goenka (@hvgoenka) April 8, 2023
ఈ వైరల్ క్లిప్ వినూత్న జైల్ రెస్టారెంట్ ఇంటీరియర్స్‌ను చూపుతూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. బ్లాగర్ రెస్టారెంట్లో ఎంటరవగానే ఎంట్రన్స్‌పై సెంట్రల్ జైలు అని రాసిఉండటం కనిపిస్తుంది. ఆపై జనాలు జైలు గదుల్లో కూర్చుని ఫుడ్ తీసుకోవడం చూడవచ్చు. ఇక పోలీస్ డ్రెస్‌లో వెయిటర్స్ కనిపించగా, ఖైదీలు ఫుడ్ సర్వ్ చేస్తుంటారు. జైల్ కే మజా ఖావో…అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
ఈ వీడియోను నెట్టింట షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ 52,000 మందికి పైగా వీక్షించారు. సెంట్రల్ జైల్ రెస్టారెంట్ బెంగళూర్‌లోని 27వ మెయిన్‌రోడ్, హెచ్ఎస్ఆర్ లేఅవుట్ ప్రాంతంలో ఉంది. ఈ జైల్ రెస్టారెంట్‌ను సందర్శిస్తామని పలువురు యూజర్లు కామెంట్స్ సెక్షన్లో రాసుకొచ్చారు. ఈ ఐడియా వినూత్నంగా ఉందని పలువురు యూజర్లు కామెంట్ చేశారు.
Read More
Aksharavanam | ఈ స్కూల్లో ఉపాధ్యాయులు.. హోంవర్క్‌లు ఉండవు…..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

