couple set themselves on fire | సహజీవనం చేస్తున్న జంట.. నిప్పంటించుకుని సజీవ దహనం
couple set themselves on fire | సహజీవనం చేస్తున్న జంట నిప్పంటించుకుని సజీవ దహనమయ్యారు. (couple set themselves on fire) వారి అరుపులు విన్న ఇరుగు పొరుగువారు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది.
బెంగళూరు: సహజీవనం చేస్తున్న జంట నిప్పంటించుకుని సజీవ దహనమయ్యారు. (couple set themselves on fire) వారి అరుపులు విన్న ఇరుగు పొరుగువారు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 20 ఏళ్ల సౌమిని దాస్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో నర్సింగ్ రెండో సంవత్సరం చదువుతున్నది. కేరళకు చెందిన 29 ఏళ్ల అభిల్ అబ్రహాం బెంగళూరులో నర్సింగ్ సర్వీస్ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. కొన్ని నెలల కిందట వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రిలేషన్లో ఉన్న ఈ జంట కొత్తనూర్ ప్రాంతంలోని ఒక ఇంట్లో కలిసి ఉంటున్నారు.
కాగా, ఆదివారం సౌమిని దాస్, అభిల్ అబ్రహాం కలిసికట్టుగా నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారి అరుపులు, మంటలు గమనించిన పొరుగువారు తలుపులు బద్ధలుకొట్టి వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే మంటల్లో కాలి సౌమిని మరణించింది. అభిల్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే పెళ్లైన సౌమిని దాస్ ఇటీవల పశ్చిమ బెంగాల్‌లోని సొంతూరుకు వెళ్లినట్లు తెలుసుకున్నారు. అభిల్‌తో సహజీవనం నేపథ్యంలో భర్తతో కలిసి ఉండలేనని ఆమె చెప్పిందని, ఈ నేపథ్యంలో తలెత్తిన గొడవల వల్ల ఆ జంట సజీవ దహనానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

