Diwali : పండగ వేళ క్రాకర్స్ అమ్మకం, వాడకం నిషేధించిన బెంగాల్!

కోల్‌కతా : హోం ఐసోలేషన్‌లో ఉండే కొవిడ్-19 రోగుల ఆరోగ్యంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు దీపావళికి క్రాకర్స్ కాల్చడంతో పాటు వాటి సేల్‌పై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిషేధం విధించింది. కేవలం గ్రీన్ క్రాకర్స్‌ను కాల్చేందుకు మాత్రమే బెంగాల్ ప్రభుత్వం అనుమతించింది. ఈ టపాసులను కూడా కేవలం రెండు గంటల్లోనే కాల్చాలని మార్గదర్శకాలు జారీ చేసింది.
దీపావళి రోజు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకే టపాసులు కాల్చాలని పశ్చిమ బెంగాల్ కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులు జారీ చేసింది. 2018లో సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా క్రాకర్స్‌పై బ్యాన్ విధించారు. టపాసులు కాల్చడంతో విడుదలయ్యే హానికారక రసాయనలు శ్వాసకోశ వ్యవస్ధపై తీవ్ర ప్రభావం చూపుతాయని, హోం ఐసోలేషన్‌లో ఉండే కొవిడ్-19 రోగుల ఆరోగ్యాన్ని ఇది మరింత క్షీణింపచేస్తుందనే ఉద్దేశంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

