శాంతి భద్రతలను కాపాడండి : బెంగాల్ గవర్నర్
బెంగాల్ గవర్నర్ | నారద స్టింగ్ ఆపరేషన్ కేసులో ఇద్దరు బెంగాల్ మంత్రులను సీబీఐ అరెస్టు చేసింది. మంత్రులు ఫిర్హద్ హకీమ్, సుబ్రతా ముఖర్జీలను

కోల్కతా : నారద స్టింగ్ ఆపరేషన్ కేసులో ఇద్దరు బెంగాల్ మంత్రులను సీబీఐ అరెస్టు చేసింది. మంత్రులు ఫిర్హద్ హకీమ్, సుబ్రతా ముఖర్జీలను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకోవడంతో.. తృణమూల్ కార్యకర్తలు ఆగ్రహాంతో ఊగిపోయారు. కోల్కతాలోని సీబీఐ కార్యాలయం ఎదుట టీఎంసీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
ఈ వ్యవహారంపై ఆ రాష్ర్ట గవర్నర్ జగదీప్ ధనఖర్ స్పందించారు. సీబీఐ కార్యాలయం ఎదుట టీఎంసీ కార్యకర్తలు ఆందోళనకు దిగడం, రాళ్ల దాడి చేయడం టీవీ చానెల్స్, ఇతర మాధ్యమాల ద్వారా చూశాను. కోల్కతా, బెంగాల్ పోలీసులు ఆందోళనకారులను అదుపు చేయకుండా, ప్రేక్షకపాత్ర వహించడంపై గవర్నర్ అసహనం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలను కాపాడాలని గవర్నర్ పోలీసులకు సూచించారు.
ఈ కేసులో నలుగురు తృణమూల్ నేతలపై విచారణ చేపట్టేందుకు సీబీఐకి గవర్నర్ జగదీప్ ధనఖర్ అనుమతి ఇచ్చారు. స్పెషల్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ.. ఆ తర్వాత వారిని కస్టడీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మూడోసారి సీఎం అయిన మమతా బెనర్జీ క్యాబినెట్లో ఫిర్హద్, సుబ్రతా ముఖర్జీలు మంత్రులుగా ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

