కర్ణాటక మఠాధిపతి ఆత్మహత్య వెనుక… హనీట్రాప్, బ్లాక్మెయిల్
బసవలింగ స్వామి సూసైడ్ నోట్‌పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాను హనీట్రాప్‌నకు గురైనట్లు, తనను బ్లాక్మెయిల్ చేసి వేధించినట్లు ఆయన ఆరోపించారు.
బెంగళూరు: కర్ణాటక మఠాధిపతి ఆత్మహత్య వెనుక హనీట్రాప్, బ్లాక్మెయిల్ వంటి కోణాలున్నాయని పోలీసులు తెలిపారు. ఆయన సూసైడ్ నోట్లో పేర్కొన్న ఇద్దరు వ్యక్తులు ఆ మఠానికి సంబంధించిన వారేనని వెల్లడించారు. రామనగర జిల్లాలోని కంచుగల్ బందే మఠాధిపతి సంత్ బసవలింగ స్వామి తన ప్రార్థన మందిరంలో సోమవారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. లింగాయత్ మఠాలకు చెందిన సాధువులు ఇటీవల వరుసగా మరణిస్తుండటం కర్ణాటకలో కలకలం రేపుతున్నది. రెండు నెలల క్రితం బెల్గాంలోని గరు మడివళేశ్వర మఠంలో బసవ సిద్ధలింగ స్వామి మృతదేహం లభించింది.
కాగా, బసవలింగ స్వామి సూసైడ్ నోట్‌పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాను హనీట్రాప్‌నకు గురైనట్లు, తనను బ్లాక్మెయిల్ చేసి వేధించినట్లు ఆయన ఆరోపించారు. నాలుగు అసభ్యకర వీడియోలు విడుదల చేస్తామంటూ ఒక మహిళ, మరి కొందరు కలిసి తనను బెదిరించినట్లు ఆ సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. తన స్థానం నుంచి తొలగించాలని భావించిన కొందరు వ్యక్తులు ఇలా కుట్రపన్నిన్నట్లు ఆరోపించారు.
మరోవైపు సూసైడ్ నోట్లో పేర్కొన్న వ్యక్తుల గురించి తమకు తెలిసిందని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. కొంతమంది మఠాధిపతులకు రాజకీయ నాయకులతో బాగా సంబంధాలున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో మఠం వెలుపల, బయట కూడా రాజకీయాలు ఉండవచ్చని చెప్పారు. అయితే సూసైడ్ నోట్లో రాజకీయ నాయకుల ప్రస్తావన లేదని పోలీస్ అధికారి తెలిపారు. ప్రతి కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, వైరల్ అవుతున్న నాలుగు వీడియోల్లోని మహిళ ఎవరనే దానిపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

