విమానాల్లో హ్యాండ్ బ్యాగేజీపై ఆంక్షలు
విమాన ప్రయాణం చేయదలచిన ప్రయాణికులు ఇక ఎయిర్పోర్టుకు బయల్దేరే ముందు బ్యూరో ఆఫ్ సిలివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(బీసీఏఎస్) ప్రకటించిన కొత్త హ్యాండ్ బ్యాగేజీ విధానం గురించి తెలుసుకోకపోతే చిక్కుల్లో పడక తప్పదు.
- 7 కిలోల బరువుండే ఒకే ఒక బ్యాగేజీకి అనుమతి
- బ్యాగేజీ ఎత్తు, పొడవు, వెడల్పుపైనా పరిమితులు
న్యూఢిల్లీ, డిసెంబర్ 24: విమాన ప్రయాణం చేయదలచిన ప్రయాణికులు ఇక ఎయిర్పోర్టుకు బయల్దేరే ముందు బ్యూరో ఆఫ్ సిలివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(బీసీఏఎస్) ప్రకటించిన కొత్త హ్యాండ్ బ్యాగేజీ విధానం గురించి తెలుసుకోకపోతే చిక్కుల్లో పడక తప్పదు. ఎయిర్పోర్టులో సెక్యూరిటీ చెక్పాయింట్ల వద్ద ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిపోతుండడంతో హ్యాండ్ లగేజీ పాలసీకి సంబంధించి నిబంధనలను కఠినతరం చేయాలని బీసీఏఎస్, సీఐఎస్ఎఫ్ నిర్ణయించాయి. దీంతో వివిధ ఎయిర్లైన్లు కూడా ఈ కొత్త విధానాన్ని అమలు చేయక తప్పని పరిస్థితి ఎదురైంది. కొత్త బీసీఏఎస్ హ్యాండ్ బ్యాగేజీ పాలసీ ప్రకారం ప్రయాణికులు ఇకపైన విమానంలోకి తమ వెంట ఒక్క బ్యాగేజీని మాత్రమే తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది.
దేశీయ లేదా అంతర్జాతీయ విమానంతో నిమిత్తం లేకుండా ప్రయాణికుడు తన వెంట కేవలం ఒక హ్యాండ్ బ్యాగేజీని మాత్రమే విమానంలోకి తీసుకెళ్లగలడు. అదనపు బ్యాగేజీ చెక్ఇన్ కావలసిందే. ఎకానమీ లేదా ప్రీమియం ఎకానమీ తరగతిలో ప్రయాణించే ప్రయాణికులు తమ వెంట విమానంలోకి 7 కిలోల వరకు బరువున్న ఒక బ్యాగేజీని మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుందని ఎయిర్ ఇండియా ప్రకటించింది. అయితే ఫస్ట్ లేదా బిజినెస్ క్లాస్లో ప్రయాణించే ప్రయాణికులు మాత్రం సుమారు 10 కిలోల వరకు బరువుండే ఒకే ఒక హ్యాండ్ బ్యాగేజీని తీసుకెళ్లవచచ్చని తెలిపింది. బ్యాగేజీ కొలతలను కూడా ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.
బ్యాగేజీ ఎత్తు 55 సెంటీమీటర్లు, పొడవు 40 సెంటీమీటర్లు, వెడల్పు 20 సెంటీమీటర్లు మించరాదని తెలిపింది. ఒక్కో ప్రయాణికుడి హ్యాండ్ బ్యాగేజీ చుట్టుకొలత 115 సెంటీమీటర్లు మించరాదని కూడా తెలిపింది. ఒకవేళ ప్రయాణికుడి హ్యాండ్ బ్యాగేజీ బరువు, విస్తీర్ణం పరిమితిని మించి ఉన్న పక్షంలో అదనపు చార్జీలు భరించక తప్పదని ఎయిర్లైన్స్ తెలిపింది. అయితే 2024 మే 2కి ముందు తమ టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులకు మాత్రం వెసులుబాటు కల్పిస్తున్నట్టు పేర్కొంది. ఎకానమీ క్లాస్ ప్రయాణికులు 8 కిలోల వరకు, ప్రీమియం ఎకానమీ క్లాస్ ప్రయాణికులు 10 కిలోల వరకు, ఫస్ట్ లేక బిజినెస్ క్లాస్ ప్రయాణికులు 12 కిలోల వరకు బరువుండే హ్యాండ్ బ్యాగేజీని తీసుకెళ్లవచ్చని ఎయిర్ ఇండియా పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BCAS
- Flights
- Hand Luggage
- New Rules
RELATED ARTICLES
తాజా వార్తలు
Itllu Arjuna | ‘ఇట్లు అర్జున’ మ్యూజికల్ ఈవెంట్కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. కింగ్ నాగార్జున, అఖిల్ కూడా సందడి!
MLA Sudheer Reddy | జైపాల్ రెడ్డిపై లేని ప్రేమంతా ఒలకబోస్తున్న రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Road Accident | డివైడర్ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి
చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోస్టర్ ఆవిష్కరణ
Narnoor | గోవర్ధన్ గుట్టపై ఆదివాసుల సాంప్రదాయ పూజలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

