కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై
Basavaraju Bommai: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మై ఎన్నికయ్యారు. ఈ సాయంత్రం బెంగళూరులో జరిగిన కర్ణాటక బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో

బెంగళూరు: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మై ఎన్నికయ్యారు. ఈ సాయంత్రం బెంగళూరులో జరిగిన కర్ణాటక బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఆయనను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలతోపాటు కేంద్ర పరిశీలకులుగా మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, జీ కిషన్‌రెడ్డి హాజరయ్యారు. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన బసవరాజు బొమ్మై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మై కుమారుడు.
1998లో జనతాదల్ పార్టీలో చేరడంతో బసవరాజు బొమ్మై రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆయన 1998, 2004లో జనతాదల్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆ తర్వాత 2008లో బీజేపీలో చేరారు. ఇప్పటివరకు ఆయన యెడియూరప్ప మంత్రి వర్గంలో హోంశాఖ మంత్రిగా ఉన్నారు. ఈ రోజు జరిగిన బీజేఎల్పీ సమావేశంలో సభా నాయకుడిగా ఎన్నికయ్యారు. సోమవారం తన పదవికి రాజీనామా చేసిన యెడియూరప్ప ప్రస్తుతం కర్ణాటక కేర్‌టేకర్ సీఎంగా కొనసాగుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

