BSF jawans | బెంగాల్లో బీఎస్ఎఫ్ జవాన్లపై బంగ్లాదేశీల దాడి.. ఆయుధాల అపహరణ
పశ్చిమబెంగాల్లోని (West Bengal) ముర్షిదాబాద్ జిల్లా బెర్హంపోర్ సెక్టార్లో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లపై (BSF jawans) బంగ్లాదేశీయులు (Bangladesh) దాడికి పాల్పడ్డారు. జవాన్లను విచక్షణారహితంగా కొట్టడంతోపాటు వారి ఆయుధాలను ఎత్తుకెళ్లారు.
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లోని (West Bengal) ముర్షిదాబాద్ జిల్లా బెర్హంపోర్ సెక్టార్లో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లపై (BSF jawans) బంగ్లాదేశీయులు (Bangladesh) దాడికి పాల్పడ్డారు. జవాన్లను విచక్షణారహితంగా కొట్టడంతోపాటు వారి ఆయుధాలను ఎత్తుకెళ్లారు. గతకొన్నిరోజులుగా ముర్షిదాబాద్ (Murshidabad) జిల్లా బెర్హంపూర్ సెక్టార్లో (Berhampore sector) ఉన్న నిర్మల్‌చార్ ఔట్‌పోస్ట్ సమీపంలోని భారతీయుల వ్యవసాయ క్షేత్రాల్లో బంగ్లాదేశ్‌కు చెందిన గ్రామస్థులు వారి పశువులను మేపుతున్నారు. దీంతో రైతులు బీఎస్ఎఫ్ అధికారులకు ఫిర్యాదుచేశారు. ఈనేపథ్యంలో నిర్మల్‌చార్ ఔట్‌పోస్ట్ (Nirmalchar outpost) వద్ద ఇద్దరు జవాన్లు విధులు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో సరిహద్దులు దాటుకుని బంగ్లాదేశ్‌కు చెందిన కొందరు తమ పశువులను మేపడానికి వచ్చారు. దీంతో బందోబస్తు విధుల్లో ఉన్న జవాన్లు వారిని అడ్డుకున్నారు. జవాన్లతో గొడవకు దిగారు. వారికి మరికొందరు జతకావడంతో అంతా కలిసి జవాన్లను విచక్షణారహితంగా కొట్టారు. పదునైన ఆయుధాలతో (Weapons) దాడిచేశారు. సమాచారం అందుకున్న బీఎస్ఎఫ్ జవాన్లు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. దుండగులను చెదరగొట్టారు. క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించారు. కాగా, జవాన్లపై విచక్షణారహితంగా దాడిచేశారని, వారి ఆయుధాలను ఎత్తుకెళ్లారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. కాగా, దాడి ఘటన అనంతరం బీఎస్ఎఫ్ అధికారులు బంగ్లాదేశ్ ఆర్మీతో ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

