Bangladesh MP: బంగ్లా ఎంపీ మర్డర్‌కు 5 కోట్లు ఇచ్చిన అతని ఫ్రెండ్
Bangladesh MP: బంగ్లా ఎంపీ అన్వరుల్ను చంపించింది అతని ఫ్రెండ్ అని తేలింది. ఆ ఎంపీ హత్య కోసం అతను 5 కోట్లు ఇచ్చినట్లు కూడా బెంగాల్ సీఐడీ వెల్లడించింది. అయితే ఇప్పటి వరకు ఆ ఎంపీ మృతదేహాన్ని గుర్తించలేదు.
కోల్‌కతా: బంగ్లాదేశ్‌కు చెందిన ఎంపీ(Bangladesh MP) అన్వరుల్ అజిమ్ అనార్.. కోల్‌కతాలో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎంపీ అన్వరుల్ను చంపేందుకు అతని మిత్రుడే అయిదు కోట్లు ఇచ్చినట్లు పశ్చిమ బెంగాల్ సీఐడీ తెలిపింది. మే 13వ తేదీ నుంచి అన్వరుల్ మిస్సింగ్‌లో ఉన్నారు. ఈ కేసులో బెంగాల్ సీఐడీ దర్యాప్తు చేపట్టినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. పక్కా ప్లాన్ ప్రకారమే మర్డర్ చేశారని, భారీ మొత్తంలో డబ్బు చేతులు మారిందని, ఆ ఎంపీని చంపేందుకు అతని పాత మిత్రుడే అయిదు కోట్లు ఇచ్చినట్లు ఓ పోలీసు ఆఫీసర్ తెలిపారు. ఆ ఎంపీ మిత్రుడు అమెరికా జాతీయుడని, అతనికి కోల్‌కతాలో కూడా ఫ్లాట్ ఉన్నట్లు ఆ ఆఫీసర్ చెప్పారు. అన్వరుల్ను హత్య చేసినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని సీఐడీ ఐజీ అఖిలేశ్ చతుర్వేది తెలిపారు. కానీ ఇప్పటి వరకు ఎంపీ అన్వరుల్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

