Bangladesh Citizen Arrest | సన్యాసిగా భారత్‌లో జీవిస్తున్న బంగ్లాదేశ్ వ్యక్తి.. ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్
Bangladesh Citizen Arrest | బంగ్లాదేశ్ వ్యక్తి బౌద్ధ సన్యాసిగా భారత్‌లో జీవిస్తున్నాడు. పలు పేర్లతో పలు దేశాల పాస్‌పార్ట్‌లు అతడి వద్ద ఉన్నాయి. థాయ్‌లాండ్ వెళ్లేందుకు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ఆ వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది అనుమానించి అరెస్ట్ చేశారు.
పాట్నా: బంగ్లాదేశ్ వ్యక్తి బౌద్ధ సన్యాసిగా భారత్‌లో జీవిస్తున్నాడు. పలు పేర్లతో పలు దేశాల పాస్‌పార్ట్‌లు అతడి వద్ద ఉన్నాయి. థాయ్‌లాండ్ వెళ్లేందుకు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ఆ వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది అనుమానించి అరెస్ట్ చేశారు. (Bangladesh Citizen Arrest) అతడ్ని ప్రశ్నించగా ఎనిమిదేళ్లుగా అక్రమంగా భారత్‌లో ఉంటున్నట్లు బయటపడింది. బంగ్లాదేశ్ పౌరుడైన బాబు జో బారువా అలియాస్ రాజీవ్ దత్తా, బీహార్‌లోని గయాలో ఎనిమిదేళ్లుగా ఉంటున్నాడు. బౌద్ధ సన్యాసిగా నటిస్తూ గయాలోని ఆశ్రమంలో నివసిస్తున్నాడు. శుక్రవారం థాయ్‌లాండ్ వెళ్లేందుకు గయా విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఆ వ్యక్తిని అనుమానించిన భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని ప్రశ్నించగా బంగ్లాదేశ్ జాతీయుడిగా తేలింది.
కాగా, చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ లేదా వీసా లేకుండా ఆ వ్యక్తి ఎనిమిదేళ్లుగా గయాలో బౌద్ధ సన్యాసిగా నివసిస్తున్నట్లు భద్రతా అధికారులు తెలుసుకున్నారు. గతంలో లుకౌట్ నోటీస్ కూడా ఉన్న అతడి వద్ద పలు పేర్లతో ఉన్న నకిలీ పాస్‌పోర్టులు, ఆధార్, పాన్ వంటి పలు నకిలీ ప్రతాలు, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు, చర్యల కోసం గయా పోలీసులకు అతడ్ని అప్పగించారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shigella infections | కేరళలో షిగెల్లా ఇన్ఫెక్షన్లు వ్యాప్తి.. 75 కేసులు నమోదు
AP Group-2 | 720 పోస్టులతో ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్.. డిసెంబర్ 11 వరకు దరఖాస్తు చేసుకోవాలి
Sonia Gandhi | సీరియల్ కిల్లర్ శోభరాజ్ గర్ల్‌ఫ్రెండ్‌కు ఇంటి నుంచి భోజనం తీసుకెళ్లా : సోనియాగాంధీ
RS Praveenkumar | ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్ల పొట్ట కొట్టాలని చూస్తున్న గ్రీన్ SM కంపెనీ : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ACB raids | ఇరిగేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌పై ఇంటిపై ఏసీబీ దాడులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

