Bangalore Stampede | బెంగళూరు తొక్కిసలాట.. సిద్ధరామయ్య సర్కారుకు కర్నాటక హైకోర్టు ప్రశ్నలు..!
Bangalore Stampede | బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై కర్నాటక హైకోర్టును సమాధానాలు కోరింది. ఆర్సీబీ విజయోత్సవ వేడుకలు జరుపుకునేందుకు ఎవరు అనుమతి ఇచ్చారు? ఈ నిర్ణయం ఎప్పుడు.. ఎలా తీసుకున్నారు? నిర్వాహకులు అవసరమైన అనుమతి తీసుకున్నారా? అంటూ పలు ప్రశ్నలను కర్నాటక హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
Bangalore Stampede | బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై కర్నాటక హైకోర్టును సమాధానాలు కోరింది. ఆర్సీబీ విజయోత్సవ వేడుకలు జరుపుకునేందుకు ఎవరు అనుమతి ఇచ్చారు? ఈ నిర్ణయం ఎప్పుడు.. ఎలా తీసుకున్నారు? నిర్వాహకులు అవసరమైన అనుమతి తీసుకున్నారా? అంటూ పలు ప్రశ్నలను కర్నాటక హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జూన్ 4న ఐపీఎల్ విజయోత్సవ వేడుకల సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటను కర్ణాటక హైకోర్టు స్వయంగా విచారించి, రాష్ట్ర ప్రభుత్వానికి పలు వేసింది. జూన్ 10 నాటికి ఆయా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి వీ కామేశ్వరరావు, న్యాయమూర్తి సీఎం జోషిలతో కూడిన బెంచ్ డివిజన్ బెంచ్ గురువారం ఈ విషయాన్ని స్వయంగా విచారించి ప్రభుత్వం నుంచి స్పందన కోరింది.
కోర్టు తొమ్మిది ముఖ్యమైన ప్రశ్నలపై కర్ణాటక హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానాలు కోరింది. జూన్ 10 నాటికి వివరణాత్మక నివేదికను దాఖలు చేయాలని కూడా కోర్టు ప్రభుత్వాన్ని కోరింది. కోర్టు అడిగిన ప్రశ్నల్లో కార్యక్రమాన్ని నిర్వహణకు ఎవరు అనుమతి ఇచ్చారు? ఈ నిర్ణయం ఎప్పుడు, ఎలా తీసుకున్నారు? నిర్వాహకులు అవసరమైన అనుమతులు పొందారా? అని ప్రశ్నించింది. అలాగే, 50వేలమందికిపైగా ప్రజలు గుమిగూడే ఇలాంటి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ప్రామాణిక నిర్వహణ విధానం (SOP) కలిగి ఉన్నదా? ట్రాఫిక్ నియంత్రణకు తగిన చర్యలు తీసుకున్నారా? జనసమూహ నిర్వహణకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సంఘటన స్థలంలో ఏ విధమైన వైద్య, అత్యవసర సేవలు అందుబాటులో ఉన్నాయి? హాజరయ్యే వారి సంఖ్య గురించి ముందుగానే ఏదైనా అంచనా వేశారా? గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించారా? వారిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఎంత సమయం పట్టింది? అంటూ కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

