నర్సరీ పిల్లలపై లైంగిక వేధింపులు
నర్సరీ చదువుతున్న ఇద్దరు చిన్నారులపై ఓ కీచకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని థాణే జిల్లా బద్లాపూర్‌లో జరిగిన ఈ ఘటనపై ప్రజల్లో ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి.
- మహారాష్ట్రలోని ఓ స్కూల్లో స్వీపర్ ఘాతుకం
- తల్లిదండ్రులు, స్థానికుల్లో వెల్లువెత్తిన ఆగ్రహం
- పాఠశాల, బద్లాపూర్ రైల్వే స్టేషన్‌పై దాడి
- గంటల తరబడి రైల్ రోకో.. 30 రైళ్లు రద్దు
థాణె/ముంబై, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): నర్సరీ చదువుతున్న ఇద్దరు చిన్నారులపై ఓ కీచకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని థాణే జిల్లా బద్లాపూర్‌లో జరిగిన ఈ ఘటనపై ప్రజల్లో ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. నిర్లక్ష్యం వహించిన పాఠశాలతో పాటు, బద్లాపూర్ రైల్వే స్టేషన్‌పై స్థానికులు, తల్లిదండ్రులు దాడి చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గంటల తరబడి రైల్ రోకో నిర్వహించారు.
తల్లిదండ్రుల కథనం ప్రకారం.. బద్లాపూర్‌లోని ఓ పాఠశాలలో నర్సరీ చదువుతున్న ఇద్దరు చిన్నారులు(మూడేండ్లు, నాలుగేండ్ల వయస్సు) ఆగస్టు 13న టాయిలెట్‌కు వెళ్లగా, అక్కడే స్వీపర్‌గా పని చేస్తున్న అక్షయ్ షిండే అనే వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆగస్టు 16న వీరిలో ఓ చిన్నారి తనకు ప్రైవేటు భాగాల వద్ద నొప్పిగా ఉందని తల్లిదండ్రులకు ఏడుస్తూ చెప్పింది. దాంతో ఆరా తీయగా, మరో చిన్నారికి కూడా అలా జరిగిందని తెలియడంతో ఇద్దరు చిన్నారులను స్థానిక దవాఖానకు తీసుకెళ్లగా వారిపై లైంగిక వేధింపులు జరిగాయని వైద్యులు చెప్పారు. దీంతోపోలీసులకు ఫిర్యాదు చేయగా ఆగస్టు 17న నిందితుడు అక్షయ్ షిండేను అరెస్టు చేశారు.
ప్రజల్లో ఆగ్రహజ్వాలలు
చిన్నారులపై లైంగిక వేధింపులకు ఒడిగట్టిన కీచకుడిపై, పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మంగళవారం ఉదయం తల్లిదండ్రులు, స్థానికులు పాఠశాల వద్ద నిరసన తెలిపారు. కొందరు ఆగ్రహంతో పాఠశాలపై దాడికి పాల్పడి వస్తువులు ధ్వంసం చేశారు. తర్వాత పక్కనే ఉన్న బద్లాపూర్ రైల్వే స్టేషన్‌పైనా రాళ్లు రువ్వారు. స్టేషన్లోకి ప్రవేశించి పట్టాలపై కూర్చొని రైల్ రోకో నిర్వహించారు. దీంతో 30 లోకల్ రైళ్లు రద్దయ్యాయి. దూరప్రాంతాలకు వెళ్లాల్సిన 12 రైళ్లను దారి మళ్లించారు. చాలా రైళ్లు ఆలస్యమయ్యాయి. కేసులో పోలీసుల నిర్లక్ష్యంపై ఆరోపణలు రావడంతో బద్లాపూర్ పోలీస్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ ఎస్సై, హెడ్ కానిస్టేబుల్‌ను వెంటనే సస్పెండ్ చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్, క్లాస్ టీచర్‌తో పాటు ఓ మహిళా సహాయకురాలిని విధుల నుంచి తొలగించినట్టు పాఠశాల యాజమాన్యం ప్రకటించింది.
విచారణ జరపనున్న ఎన్సీపీసీఆర్, సిట్
బద్లాపూర్ ఘటనపై బాలల హక్కుల రక్షణ జాతీయ కమిషన్(ఎన్సీపీసీఆర్) స్పందించింది. కేసులో పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఎన్సీపీసీఆర్ చైర్పర్సన్ ప్రియాంక్ కనుంగో తెలిపారు. దీనిపై విచారణ జరిపేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఐజీ స్థాయి అధికారి ఆర్తి సింగ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను నియమించింది. కేసును ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో విచారణ జరిపించి, న్యాయం జరిగేలా చూస్తామని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తెలిపారు. కాగా, ఈ పాఠశాల బీజేపీకి చెందిన వ్యక్తిదని తనకు తెలిసిందని, అయినా రాజకీయాలు చేయదల్చుకోలేదని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని శివసేన(ఉద్ధవ్) అధినేత ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

