పంజాబ్లో ఆప్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ బుడతడు మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించడంతో ఆ బుడతడు అప్పటి విజయోత్సవాల్లో కనిపించాడు. అచ్చు సీఎం కేజ్రీవాల్ లాగే తయారయ్యాడు. ఎరుపు రంగు స్వెట్టర్, మెడలో నలుపు రంగు కండువా, తలపై ఆప్ టోపీ, మీసాలతో అందరి దృష్టీ ఆకర్షించాడు. సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయ్యాడు. పంజాబ్లో ఆప్ అఖండ విజయం సాధించడంతో ఆ బుడతడు మళ్లీ వార్తల్లోకెక్కాడు. ఈ సారి కూడా ఎరుపు రంగు స్వెట్టర్, మెడలో నలుపు రంగు కండువాలే ఉన్నాయి. కళ్లకు అద్దాలు పెట్టుకున్నాడు. అయితే తలపాగా కలర్ మాత్రం మార్చేశాడు. పసుపు పచ్చ కలర్ ఉన్న తలపాగాను ధరించి మళ్లీ అందరి దృష్టీ ఆకర్షించారు. ఆప్ విజయోత్సవాల్లో తెగ సందడి చేస్తున్నాడు.