Rajasthan | రెండు గుండెలు, నాలుగు కాళ్లు, చేతులతో.. వింత శిశువు జననం..!
Rajasthan | రాజస్థాన్ (Rajasthan)లో అరుదైన ఘటన (unique case) చోటు చేసుకుంది. రాష్ట్రంలోని చురు (Churu ) జిల్లాలో ఓ వింత శిశువు జన్మించింది. రెండు గుండెలు ( two hearts), నాలుగు కాళ్లు (four legs), నాలుగు చేతుల (four arms)తో ఆడ శిశువు పుట్టింది.
Rajasthan | రాజస్థాన్ (Rajasthan)లో అరుదైన ఘటన (unique case) చోటు చేసుకుంది. రాష్ట్రంలోని చురు (Churu ) జిల్లాలో ఓ వింత శిశువు జన్మించింది. రెండు గుండెలు ( two hearts), నాలుగు కాళ్లు (four legs), నాలుగు చేతుల (four arms)తో ఆడ శిశువు పుట్టింది. చిన్నారికి తల మాత్రం ఒక్కటే ఉంది. అయితే, ఆ శిశువు పుట్టిన 20 నిమిషాల్లోనే మృతి చెందింది. చురు జిల్లా రతన్‌గఢ్ (Ratangarh)లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జరిగిందీ ఘటన.
ఆసుపత్రి వైద్యుడు కైలాష్ (Dr. Kailash Songara) తెలిపిన వివరాల ప్రకారం.. రజల్దేసర్ (Rajaldesar) ప్రాంతానికి చెందిన హజారీ సింగ్ అనే 19 ఏళ్ల మహిళ పురిటి నొప్పులతో ఆదివారం రాత్రి స్థానిక ఆసుపత్రిలో చేరింది. వైద్యులు ఆమెకు నిర్వహించిన సోనోగ్రఫీ (Sonography) పరీక్షల్లో శిశువు వింతగా కనిపించింది. కడుపులోని బిడ్డకు రెండు గుండెలు, నాలుగు చేతులు, నాలుగు కాళ్లతోపాటు రెండు వెన్నెముకలు ఉన్నట్టు గుర్తించారు. తల మాత్రం ఒకటే ఉందని, హృదయ స్పందనలు తక్కువగా ఉండడంతో పుట్టిన 20 నిమిషాలకే నవజాత శిశువు మృతి చెందినట్టు వైద్యుడు కైలాష్ తెలిపారు. మహిళకు సాధారణ ప్రసవమే జరిగిందని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నట్టు పేర్కొన్నారు.
కాగా, వింత శిశువు జననంపై డాక్టర్ రీటా సొంగరా (Dr. Rita Songara) మాట్లాడుతూ.. మహిళకు ఇతర ఆసుపత్రుల్లో చేసిన సోనోగ్రఫీ (Sonography) పరీక్షల్లో శిశువు సాధారణంగా ఉన్నట్టు రిపోర్టులు వచ్చాయన్నారు. ఇంత కష్టమైన డెలివరీని నార్మల్‌గా చేయడం కష్టసాధ్యమైన పనేనని అన్నారు. అయితే, సకాలంలో సాధారణ ప్రసవం చేయడం వల్ల తల్లి ప్రాణాలు కాపాడగలిగినట్టు చెప్పారు. ఇలాంటి డెలివరీని ‘కంజుక్టివల్ అనోమలీ’ (conjunctival anomaly) అంటారని తెలిపారు. క్రోమోజోముల (chromosome) వల్ల ఇలా జరుగుతుండొచ్చని డాక్టర్ రీటా అభిప్రాయపడ్డారు.
Also Read..
Hardik Pandya | పాండ్యా అరుదైన రికార్డు.. దిగ్గజాలను దాటుకుని
Beers | స్మార్ట్ ఫోన్ కొనండి.. రెండు బీర్లు ఉచితంగా పొందండి..
Holi: ఉజ్జయిని మహాకాలేశ్వురుడి సన్నిధిలో హోళీ.. వీడియో
Holi Celebrations | రంగుల పండుగ నాడు రసాయనాలు వద్దు.. ఈ జాగ్రత్తలు మాత్రం మస్ట్ !!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

