న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ కోసం పాప, ఒక కోతి మధ్య చిన్న ఫైట్ జరిగింది. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అయ్యింది. ‘జగదీష్మాదినేనిమాదినేని’ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ ఇటీవల ఒక వీడియోను పోస్ట్ చేశారు. గ్రామంలోని ఒక ఇంటి బయట నులక మంచంపై ఒక పాప ఉంటుంది. ఆ చిన్నారి తన చేతిలోని మొబైల్‌తో ఆడుకుంటుంది. ఇంతలో ఒక కోతి ఆ మంచం వద్దకు వస్తుంది. పాప నుంచి మొబైల్ ఫోన్ లాక్కొని తదేకంగా దానిని చూస్తుంది.
మరోవైపు కోతిని చూసి ఏ మాత్రం భయపడని ఆ పాప, దాని చేతిలోని మొబైల్‌ను లాక్కుంటుంది. అయితే ఆ కోతి వెంటనే ఆ పాప నుంచి మళ్లీ మొబైల్‌ను లాక్కొని రెండు చేతులతో గట్టిగా పట్టుకుంటుంది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోను ఇప్పటి వరకు 1.5 లక్షల మంది వీక్షించారు. మొబైల్ కోసం పాప, కోతి కొట్లాటపై నవ్వుతున్న ఎమోజీలు, పలు కామెంట్లతో నెటిజన్లు స్పందించారు.