రష్యా టు గోవా విమానానికి బాంబు బెదిరింపు.. ఉజ్బెకిస్తాన్‌లో అత్యవసర ల్యాండింగ్
రష్యా నుంచి గోవాకు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా ఉజ్బెకిస్తాన్‌లో దించారు. ఆ విమానంలో 238 మంది ప్రయాణికులు ఉన్నారు.
పనాజీ: రష్యాలోని పర్మ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి గోవాకు బయలుదేరి విమానానికి బెదిరింపు కాల్ వచ్చింది. ఈ నేపథ్యంలో అజుర్ ఎయిర్ సంస్థకు చెందిన ఆ విమానాన్ని అత్యవసరంగా ఉజ్బెకిస్తాన్‌కు డైవర్ట్ చేశారు. ఆ విమానంలో 238 మంది ప్రయాణికులు ఉన్నారు. దాంట్లో ఇద్దరు శిశువులు ఉన్నట్లు తెలుస్తోంది. విమానం సిబ్బంది ఏడు మంది ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
వాస్తవానికి ఆ చార్టెడ్ ఫ్లయిట్ గోవాలోని డబోలిన్ విమానాశ్రయంలో తెల్లవారుజామున 4.15 నిమిషాలకు ల్యాండ్ కావాల్సి ఉంది. కానీ భారతీయ వైమానిక క్షేత్రంలోకి ప్రవేశించకముందే దాన్ని ఉజ్బెకిస్తాన్‌కు దారి మళ్లించారు. విమానంలో బాంబు ఉన్నట్లు రాత్రి 12.30 నిమిషాలకు గోవా ఎయిర్‌పోర్ట్‌కు మెయిల్ వచ్చింది. దీంతో ఆ విమానాన్ని దారి మళ్లించే నిర్ణయం తీసుకున్నారు.
రెండు వారాల క్రితం మాస్కో నుంచి గోవాకు వస్తున్న ఓ విమానాన్ని అత్యవసరంగా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ల్యాండ్ చేసిన విషయం తెలిసిందే. బాంబు బెదిరింపు రావడం వల్లే ఆ విమానాన్ని దించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

