Ayodhaya | అయోధ్య రామాలయంలో రోస్టర్ విధానంపై వెనక్కి..!
Ayodhaya | అయోధ్య రామ మందిరంలో కొత్తగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జారీ చేసిన రోస్టర్‌ను నిలిపిశారు. అర్చకులు గతంలోనే మాదిరిగానే రాంలల్లాకు పూజలు చేస్తారని తెలిపారు. అర్చకుల నుంచి రోస్టర్ విధానంపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో అమలును వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Ayodhaya | అయోధ్య రామ మందిరంలో కొత్తగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జారీ చేసిన రోస్టర్‌ను నిలిపిశారు. అర్చకులు గతంలోనే మాదిరిగానే రాంలల్లాకు పూజలు చేస్తారని తెలిపారు. అర్చకుల నుంచి రోస్టర్ విధానంపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో అమలును వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అర్చకులందరూ ట్రస్టుకు ఇచ్చిన లేఖతో ట్రస్టు తన నిర్ణయాన్ని ఉప సంహరించుకుంటుందని ఆలయ ప్రధాన అర్చకులు ఆచార్య సత్యేంద్ర దాస్ వెల్లడించారు. ప్రస్తుతం అర్చకులు అంతా గతంలోనే మాదిరిగానే సేవ చేస్తారన్నారు. శ్రావణ మాసాన్ని దృష్టిలో పెట్టుకొని శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ అర్చకులతో సమావేశం నిర్వహించింది. వారిని నాలుగు గ్రూపులుగా విభజించింది. రామమందిరం, కుబేర్ తిల, యజ్ఞశాల స్థలంలో పది గంటల పాటు విధుల్లో ఉండాలని షరతు విధించింది.
శ్రీరామ జన్మభూమి కాంప్లెక్స్‌లో ఫలానా స్థలంలో విధులు కేటాయించిన అర్చకుడు మరో 15 రోజుల పాటు మరో ప్రాంతంలో పూజలు చేసేందుకు వీలుండదు. కుబేర్ తిల, యాగశాలలో పూజలు చేసే వారు గర్భాలయం వరకు వెళ్లేందుకు అవకాశం ఉండదు. దీని నుంచి అర్చకులంతా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నది. ఇటీవల అర్చకులకు డ్రెస్‌కోడ్‌ని సైతం అమలులోకి తీసుకువచ్చింది. త్వరలో ట్రస్టు ద్వారా అర్చకులందరికీ దుస్తులు అందజేయనున్నది. అలాగే, 25 మంది అర్చకులకు రామమందిర్ ట్రస్ట్ కీప్యాడ్ ఫోన్లను అందజేసింది. పూజారులు ఇకపై రామ మందిరంలో కీప్యాడ్ ఫోన్లను మాత్రమే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్ల వాడకాన్ని నిషేధించారు. గతవారం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ అర్చకులతో సమావేశం నిర్వహించి ప్రవర్తనా నియమావళిని అమలులోకి తీసుకువచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

