దేశద్రోహం కేసులో అయేషాను విచారించిన లక్షద్వీప్ పోలీసులు

కొచ్చి: సామాజిక కార్యకర్త, నటి అయేషా సుల్తానాను లక్షద్వీప్ పోలీసులు విచారించారు. ఆదివారం సాయంత్రం ఆమె లక్షద్వీప్ రాజధాని కవరట్టిలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. దేశద్రోహం కేసులో విచారణ సాగింది. ఓ టీవీ చర్చలో పాల్గొన్న అయేషా.. లక్షద్వీప్ పాలనాధికారిని జీవాయుధంతో పోల్చారు. ఈ నేపథ్యంలో ఓ బీజేపీ నేత చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆమెపై కేసు బుక్ చేశారు. అయితే ఆ కేసులో ఆమె ముందుస్తు బెయిల్ తెచ్చుకున్నారు. కావరట్టి పోలీసులు సుమారు మూడున్నర గంటల పాటు అయేషాను విచారించినట్లు తెలుస్తోంది. ఓ వీడియో పోస్టు చేసిన ఆమె.. విచారణ సవ్యంగా సాగినట్లు చెప్పింది. మరో నాలుగు రోజుల పాటు లక్షద్వీప్‌లోనే ఉండాలని పోలీసులు ఆదేశించినట్లు వెల్లడించారు. లక్షద్వీప్‌లోని చీలత్ దీవి ఆమె స్వంత ఊరు. కొచ్చిలో ఉంటున్న సుల్తానా.. మోడలింగ్ చేస్తోంది. మళయాళం సినిమాల్లోనూ నటిస్తోంది. లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫూల్ పటేల్‌ను తొలగించాలని కేరళ అసెంబ్లీ ఏకగ్రీ తీర్మానం చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

