Corona Third Wave | హిమాచల్‌ప్రదేశ్‌కు పర్యాటకుల తాకిడి.. చేయిదాటిపోయే అవకాశం ఉందంటున్న సీఎం
Himachal Pradesh : కరోనా వైరస్ థర్డ్ వేవ్ దేశంలో ఎప్పుడైనా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్గదర్శకాల్లో కొంత వెసులుబాటు కల్పించడంతో ప్రజలు గుంపులుగా ఉండటం, శుభకార్యాలకు పెద్ద సంఖ్యలో హాజరవుతుండటం ఈ థర్డ్ వేవ్ భయానికి కారణమవుతున్నది. ముఖ్యంగా హిమాచల్‌ప్రదేశ్, జమ్ముకశ్మీర్ వంటి పర్యాటక రాష్ట్రాలకు పెద్ద సంఖ్యలో...

సిమ్లా : కరోనా వైరస్ థర్డ్ వేవ్ దేశంలో ఎప్పుడైనా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్గదర్శకాల్లో కొంత వెసులుబాటు కల్పించడంతో ప్రజలు గుంపులుగా ఉండటం, శుభకార్యాలకు పెద్ద సంఖ్యలో హాజరవుతుండటం ఈ థర్డ్ వేవ్ భయానికి కారణమవుతున్నది. ముఖ్యంగా హిమాచల్‌ప్రదేశ్ (Himachal Pradesh), జమ్ముకశ్మీర్ వంటి పర్యాటక రాష్ట్రాలకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుండటం కలవరానికి గురిచేస్తున్నది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్‌లోని తాజ్‌మహల్, మీర్జాపూర్ వాటర్‌ఫాల్స్ వంటి పర్యాటక ప్రాంతాలు పర్యాటకులతో నిండిపోయి కనిపిస్తున్నాయి.
కరోనా నిబంధనలను సడలించిన అనంతరం ఒక్క హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రానికే దేశంలోని మిగతా ప్రాంతాల నుంచి దాదాపు 5 లక్షల పర్యాటకులు వచ్చారని గణాంకాలు చెప్తున్నాయి. రెండు నెలల క్రితం ముగిసిన వేసవికాలంలో పర్యాటకుల సంఖ్య మరీ ఎక్కువగా ఉన్నదని అధికారులు చెప్తున్నారు. ఏటా జూలై నెలలో 25-30 శాతం హోటల్ బుకింగ్స్ జరిగేవి. కాగా, గత నెలలో ఇవి 70 నుంచి 100 శాతానికి చేరుకున్నాయని హోటల్ పరిశ్రమకు చెందిన వారు చెప్తున్నారు. ఇది హిమాచల్‌ప్రదేశ్‌లో కరోనా మరోసారి విజృంభించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. గత 13 రోజుల్లోనే ఇక్కడ కరోనా కేసులు రెట్టింపయ్యాయి. ఈ కేసులు 102 శాతం పెరిగినట్లు అధికారులు గుర్తించారు. జూలై 28 నాటికి 953 కేసులు నమోదు కాగా.. ఆగస్ట్ 9 నాటికి ఈ సంఖ్య 2,086 కు చేరింది. ఇప్పటివరకు ఇక్కడ 2 లక్షలకు పైగా కేసులు, 3,500 మంది చనిపోయినట్లు అధికారిక లెక్కలను బట్టి తెలుస్తున్నది.
దృష్టి సారించాం : సీఎం జైరాం ఠాకూర్
హిమాచల్‌ప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతుండటం పట్ల ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ విచారం వ్యక్తం చేశారు. సోమవారం నాడు సంఖ్య ఒకేసారి పెరిగాయని, దీనిపై క్యాబినెట్లో చర్చించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయలేకపోతున్నామని ఆయన చెప్పారు. ప్రజలు కనీస దూరం పాటించడం, మాస్క్‌లు ధరించడంతోపాటు పెద్ద సంఖ్యలో గుమిగూడకుండా చూడటం వల్ల కరోనా వైరస్‌ను నిరోధించవచ్చుననేది ప్రజలు గుర్తించాలి.
ఇవి కూడా చదవండి..
నేటి నుంచి ఉమ్రాకు సౌదీ అనుమతి
ఉజ్వల 2.0 పథకాన్ని ప్రారంభించిన మోదీ
ఇలా నీరజ్ ‘పసిడి’కి గుర్తింపు..
నెట్‌ఫ్లిక్స్‌తో చేతులు కలిపిన సంజయ్‌లీలా భన్సాలీ
వీరి నివాసం కేరాఫ్ పోలీస్ స్టేషన్..!
నీరజ్ చోప్రా ‘పసిడి’ రహస్యమిదే..?!
శ్రీనగర్‌లో రాహుల్‌గాంధీ పర్యటన
అంతరిక్షంలో వరుడు.. టెక్సాస్‌లో వధువు.. వీడియో కాల్లో పెండ్లి
రక్తంలో షుగర్ నియంత్రణకు కృత్రిమ క్లోమం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

